ఆశా వర్కర్లకు పరిష్కారం లేకపోతే చలో అసెంబ్లీ

కామారెడ్డి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అంగన్వాడీ లు సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వంలో వారు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటకు పైగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్ ముదం అరుణ్ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కనీస వేతనం 18000 లు అమలు చేస్తామనిఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పని భద్రత హామీ కూడా ఇప్పటికే అమలు కాలేదన్నారు.ఎన్నికల్లో మాతో పని చేయించుకుని పారితోషికం ఇవ్వలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి బకాయిల విడుదల చేయాలని అన్నారు. పి ఎఫ్ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుదీర్ఘంగా మాట్లాడిన షబ్బీర్ ఆలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిరా, రాజశ్రీ నాయకులు మమత, ప్రమీల ,వనిత, లావణ్య, పద్మ, జ్యోతి, రమ ,లత, శివరాజవ్వ, భాగ్యలక్ష్మి, లావణ్య, మానస ,ఎల్లారెడ్డి మంజుల ,గంగమణి, యశోద ,సునీత, స్వరూప పాల్గొన్నారు

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్