పోలీసు దాడిలో ఆశ వర్కర్లకు గాయాలు

*సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
*భారీ కేట్లను పక్కకు జరిపి గేటు వద్ద ఆందోళన నిర్వహించిన ఆశ వర్కర్లు, CITU నాయకులు
*పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశా వర్కర్లు
*మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని సస్పెండ్ చేసే అరెస్టు చేయాలని డిమాండ్
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆశ వర్కర్లు సిఐటియు నాయకులు భారీ కేట్లను తోసేసి కలెక్టరేట్ గేటు ముందుకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్, ముదం అరుణ్ లు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుదామని వెళితే పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తత కి దారితీసిందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ దౌర్జన్యం చేశాడని, మహిళలను చూడకుండా చేతులు పట్టుకొని లాగేస్తూ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 48 గంటలుగా ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపిన కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు మరవడం సరైన పద్ధతి కాదని అన్నారు. వెంటనే ఆశ వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని లెప్రసీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల చలో హైదరాబాద్ కీ పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నరసింహులు ,సత్యం ,మోహన్ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిర ,రాజశ్రీ ,మమత, లావణ్య, గీత, లలిత, ఎల్లారెడ్డి మంజుల, అనిత, ప్రమీల, వనిత ,భాగ్యలక్ష్మి, లత, సుధారాణి, పద్మ, గంగమణి ,మణెమ్మ, యశోద, పుష్ప, నాగమణి, కామేశ్వరి, శశికళ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్