Posts

Showing posts with the label bjp

బీజేపీకి జెన్ జీ ఔట్ ఆఫ్ సిలబస్? యువత ఆందోళనలపై ప్రత్యేక విశ్లేషణ

Image
బీజేపీకీ జెన్ జీ పూర్తిగా ఔట్ ఆఫ్ సిలబస్! (* కొనతం దిలీప్) ఈ దేశంలో ఎవరు తమ హక్కుల కోసం గొంతెత్తినా వారిని దేశద్రోహులు అని ముద్రవేయడం బీజేపీ ఇన్నాళ్లూ వాడిన ఎత్తుగడ. కానీ ఆ ఎత్తుగడ ఇక పనిచేయదు అని ఢిల్లీలో జెన్ జీ యువత చేస్తున్న ఆందోళనలు నిరూపిస్తున్నాయి. ఇదివరకు సీఏఏ ఆందోళనల్లో రైతుల ఆందోళనల్లో బీజేపీ చాలా అలవోకగా వీరిని వేర్పాటువాదులు, మిలిటెంట్లు, దేశద్రోహులు అని ముద్రవేసింది. వారి ఐటీ సెల్ సహాయంతో సామాన్య ప్రజల్లో ఇదే విషయం మీద ప్రాపగాండా చేయగలిగింది కానీ నీట్ పేపర్ లీక్ అంశంతో రాజుకున్న జెన్ జీ ఆందోళనలు అలా కొట్టివేయడానికి వీళ్లేనివి ఎందుకంటే వీటిలో పాల్గొంటున్నది ఎక్కువగా మధ్యతరగతి భద్రజీవుల పిల్లలు. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుండే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. ఈ రెండు సెక్షన్లలో సాంప్రదాయకంగా బీజేపీ మద్ధతుదారులు గణనీయ సంఖ్యలో ఉంటారు. అటువంటి సెక్షన్ల నుండే ఇప్పుడు బీజేపీ మీద, ప్రధాని మోదీ నాయకత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గత 2-3 రోజులుగా ఆ ముక్కుపచ్చలారని పిల్లల మీద పాశవికంగా అణచివేతను ప్రయోగిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద దేశమంతటా ఆగ్రహజ్వాలలు ఎగుస్తున్నాయి. యువతీయువ...

బీజేపీ వ్యతిరేక నినాదాల కేసు కొట్టివేత.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Image
ముంబైలో ఒక సామాన్యుడు బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అన్నందుకు నమోదైన కేసును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ మాధవ్ జామ్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఒక సామాన్యుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం, అతడిని బహిష్కరించడం వంటి చర్యలను కోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, జరుగుతుంటే పౌరులపై వరుస కేసులు పెట్టి అణచివేయడం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. నిరసనను అణచివేయడం అధికార సాధన కాదని, ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదని, అది పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. " పౌరులందరినీ మీరు ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదం చేస్తే కేసులు పెడతారా?" అంటూ ఆయన పోలీసులను నిలదీశారు. కళ్ల ముందే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాల మీదనే కక్...

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది. అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక.. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్... స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్.. మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను    ఓడించేందుకు  అనేక పాచికలు వేశారు.. ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది.. కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా ...