బీజేపీ వ్యతిరేక నినాదాల కేసు కొట్టివేత.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబైలో ఒక సామాన్యుడు బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అన్నందుకు నమోదైన కేసును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ మాధవ్ జామ్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఒక సామాన్యుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం, అతడిని బహిష్కరించడం వంటి చర్యలను కోర్టు రద్దు చేసింది.
విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, జరుగుతుంటే
పౌరులపై వరుస కేసులు పెట్టి అణచివేయడం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు.
నిరసనను అణచివేయడం అధికార సాధన కాదని, ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదని, అది పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
"
పౌరులందరినీ మీరు ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదం చేస్తే కేసులు పెడతారా?" అంటూ ఆయన పోలీసులను నిలదీశారు.
కళ్ల ముందే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాల మీదనే కక్ష కట్టడం వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసన తెలపడం పౌరుడి ప్రాథమిక హక్కు అని, దానిని అణచివేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఇన్నాళ్లకు ఒక అద్భుతమైన తీర్పు హ్యాట్సాఫ్ ...
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel