బీజేపీకి జెన్ జీ ఔట్ ఆఫ్ సిలబస్? యువత ఆందోళనలపై ప్రత్యేక విశ్లేషణ

బీజేపీకీ జెన్ జీ పూర్తిగా ఔట్ ఆఫ్ సిలబస్!

(* కొనతం దిలీప్)


ఈ దేశంలో ఎవరు తమ హక్కుల కోసం గొంతెత్తినా వారిని దేశద్రోహులు అని ముద్రవేయడం బీజేపీ ఇన్నాళ్లూ వాడిన ఎత్తుగడ.

కానీ ఆ ఎత్తుగడ ఇక పనిచేయదు అని ఢిల్లీలో జెన్ జీ యువత చేస్తున్న ఆందోళనలు నిరూపిస్తున్నాయి.

ఇదివరకు సీఏఏ ఆందోళనల్లో
రైతుల ఆందోళనల్లో
బీజేపీ చాలా అలవోకగా వీరిని వేర్పాటువాదులు, మిలిటెంట్లు, దేశద్రోహులు అని ముద్రవేసింది.
వారి ఐటీ సెల్ సహాయంతో సామాన్య ప్రజల్లో ఇదే విషయం మీద ప్రాపగాండా చేయగలిగింది

కానీ నీట్ పేపర్ లీక్ అంశంతో రాజుకున్న జెన్ జీ ఆందోళనలు అలా కొట్టివేయడానికి వీళ్లేనివి


ఎందుకంటే వీటిలో పాల్గొంటున్నది ఎక్కువగా మధ్యతరగతి భద్రజీవుల పిల్లలు. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుండే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు.

ఈ రెండు సెక్షన్లలో సాంప్రదాయకంగా బీజేపీ మద్ధతుదారులు గణనీయ సంఖ్యలో ఉంటారు.

అటువంటి సెక్షన్ల నుండే ఇప్పుడు బీజేపీ మీద, ప్రధాని మోదీ నాయకత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది.


గత 2-3 రోజులుగా ఆ ముక్కుపచ్చలారని పిల్లల మీద పాశవికంగా అణచివేతను ప్రయోగిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద దేశమంతటా ఆగ్రహజ్వాలలు ఎగుస్తున్నాయి.

యువతీయువకుల మీద కేంద్ర బలగాలు, పోలీసులు చేస్తున్న దాడులు, దాష్టీకాలు దేశవ్యాప్తంగా తల్లితండ్రుల్లో ఆగ్రహావేశాలు కలుగజేస్తున్నాయి. 

అన్ని ప్రతిపక్ష పార్టీలు యువత ఆందోళనలకు మద్ధతు పలుకుతుండటంతో రోజురోజుకీ ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్నది.



మామూలుగానైతే మత రాజకీయాలతో దేశ ప్రజలకు ఉన్న ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవినీతి, పాలనా వైఫల్యాలు వంటి నిజమైన సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసే బీజేపీకీ ఇప్పుడు జెన్ జీ పూర్తిగా ఔట్ ఆఫ్ సిలబస్.

దేశంలో మత రాజకీయాలతో చిచ్చురాజేస్తున్న బీజేపీ అంతం జెన్ జీ ఉద్యమకారులతోనే మొదలవుతుంది.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్