Posts

Showing posts with the label kamareddy

మాట తప్పని ముఖ్యమంత్రి.. పేదవాడి ఇంటి కల సాకారం

Image
  రాజకీయాల్లో ఇచ్చిన మాట గాలికి కొట్టుకుపోయే కాలమిది. కానీ, తాను ఇచ్చిన హామీని ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిరూపించారు. మూడేళ్ల క్రితం ఒక సామాన్య పేద కుటుంబానికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ.. శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నూతన 'ఇంద్రమ్మ ఇల్లు' గృహప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. 2023 మార్చి 18న పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.  ఆ రోజు వారి కన్నీళ్లు చూసి చలించిపోయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాటిచ్చారు. నేడు ఆ మాట అక్షర సత్యమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది రేవంత్ రెడ్డి నైతికతకు నిదర్శనం అన్నారు.  రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో చెబుతారు, కానీ అధికారంలోకి వ...

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ - బద్నాం షబ్బీర్ కు - KVR సేఫ్ సైడ్

Image
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ బద్నాం షబ్బీర్ కు KVR సేఫ్ సైడ్ (జమాల్పూర్ గణేష్ ములుపురు రాజేంద్ర బాబు) కామారెడ్డి కాలేజీ భూముల వివాదంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.దూకుడు,దుందుడుకు స్వభావిగా ముద్ర పడిన రమణ రెడ్డి చాణక్య నీతితో తాపీగా బాల్ ను కాంగ్రెస్ గ్రౌండ్ లోకే తోసి తమాషా చూస్తున్నారు.. ఇక రమణ రెడ్డి మీద విమర్శలు,ఆరోపణలతో చీటికి మాటికి చికాకు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీనే నిర్దిష్ట,రికార్డుల ప్రాతిపదికన తేల్చాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి నెట్టివేయ బడింది. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డిలో పెద్ద దిక్కుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థి షబ్బీర్ అలీ నోటికి తాళం వేసే వ్యూహంలో భాగంగానే రమణ రెడ్డి అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. తన పైన కాలేజీ భూముల వ్యవహారంలో వస్తున్న విమర్శల నిగ్గు తేల్చాలని కలెక్టర్ను కలిసి లేఖ ఇవ్వడం సంచలనం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కలెక్టరుకు కాలేజీ భూముల్లో  MLA ప్రమేయాన్ని గుర్తించడం,అక్రమాలను గుర్తించడం,దీనిలోనూ రమణ రెడ్డి జోక్యాన్ని నిర్దారించడం అనేది కత్తిమీద సామే. భూములను ఏయే సంస్థలకు ఎన్ని ఎకరాలు కేట...

CSI గ్రౌండ్లో చర్చకు రా.. MLA వెంకట రమణ రెడ్డికి - కాంగ్రెస్ సవాల్

Image
  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీరుపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. 'వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం!'అంటూ మండి పడింది. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు; 1)​రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా: తన విద్యాసంస్థ పక్కన ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టింది నువ్వు కదా?కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా 30 వేల గజాల భూమిని బెదిరించి 3 వేల గజాలకు తగ్గించలేదా? 2 )​కర్షక్ విద్యాసంస్థల కుంభకోణం: రైతుల బిడ్డల కోసం సేకరించిన 260 ఎకరాల భూమిని అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి దారదత్తం చేసి, ఆ భూములను బ్యాంకులో కుదవపెట్టి రూ. 7 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? 3)ఫోర్జరీ సంతకాలపై కోర్టు కేసులు ఉన్నవా లేవా? 4)"మూడు నెలల క్రితం జపాన్ పర్యటన వెనుక అసలు కథ ఏంటి? అక్కడ ఏం చేశావో సెకండ్ ఎపిసోడ్‌లో నీ బండారం బయటపెడతాం" అని హెచ్చరించారు. 5) ​రోడ్డు నిర్మాణం వెనుక కమీషన్లు: టేక్రియల్ నుండి లింగాపూర్ 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకున్న వ్యక్తివి, ఇప్పుడు ముందుండి ఎందుకు వేయిస్తున్నావు? అందులో నీకు ఎంత ముట్టింది? 6)​వరుస మోసాలు - బెదిరింపులు ​ఎమ్మెల్...