కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ - బద్నాం షబ్బీర్ కు - KVR సేఫ్ సైడ్
- Get link
- X
- Other Apps
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్
బద్నాం షబ్బీర్ కు
KVR సేఫ్ సైడ్
(జమాల్పూర్ గణేష్
ములుపురు రాజేంద్ర బాబు)
కామారెడ్డి కాలేజీ భూముల వివాదంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.దూకుడు,దుందుడుకు స్వభావిగా ముద్ర పడిన రమణ రెడ్డి చాణక్య నీతితో తాపీగా బాల్ ను కాంగ్రెస్ గ్రౌండ్ లోకే తోసి తమాషా చూస్తున్నారు.. ఇక రమణ రెడ్డి మీద విమర్శలు,ఆరోపణలతో చీటికి మాటికి చికాకు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీనే నిర్దిష్ట,రికార్డుల ప్రాతిపదికన తేల్చాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి నెట్టివేయ బడింది.
కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డిలో పెద్ద దిక్కుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థి షబ్బీర్ అలీ నోటికి తాళం వేసే వ్యూహంలో భాగంగానే రమణ రెడ్డి అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు.
తన పైన కాలేజీ భూముల వ్యవహారంలో వస్తున్న విమర్శల నిగ్గు తేల్చాలని కలెక్టర్ను కలిసి లేఖ ఇవ్వడం సంచలనం అయ్యింది.
ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కలెక్టరుకు కాలేజీ భూముల్లో MLA ప్రమేయాన్ని గుర్తించడం,అక్రమాలను గుర్తించడం,దీనిలోనూ రమణ రెడ్డి జోక్యాన్ని నిర్దారించడం అనేది కత్తిమీద సామే.
భూములను ఏయే సంస్థలకు ఎన్ని ఎకరాలు కేటాయించిన విషయం ప్రభుత్వ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంది. కానీ షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నట్లు కాలేజీ కమిటీ 26 ఎకరాల స్థలాన్ని అరోరా కాలేజీకి కేటాయించిన భూములను బ్యాంక్ లో తనఖా పెట్టి 6 కోట్లు రమణ రెడ్డి తీసుకున్నారనే విషయంలో ఫిక్స్ చేయడం కలెక్టరు కే కాదు..ఎవరి తరమూ కాదు..ఎందుకంటే భూముల లీజ్ హోల్డర్ అయిన అరోరా యజమాణ్యమే బ్యాంకు లావాదేవీలకు బాధ్యత వహిస్తుందనేది జగమెరిగిన సత్యం.ఈ చిన్న లాజిక్ సుధీర్గ రాజకీయ అనుభవం గడించిన షబ్బీర్ అలీ ఎట్లా మిస్సయ్యారనేది వెయ్యి డాలర్ల ప్రశ్న గా మారింది. అంతెందుకు భూముల కేటాయింపు జరిగిందే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడూ అధికారంలో వుందీ కాంగ్రెస్సే.ఈ సర్కారు కు, సీఎం రేవంత్ రెడ్డికి తానే సలహా దారున్నని పొద్దస్తమానం చెప్పుకునే షబ్బీర్ అలీ అనుకుంటే 24 గంటల్లో రికార్డులన్నీ ఉన్నత విద్యా శాఖ దఫ్తర్ల నుంచి తన్నుకుని ముందు ప్రత్యక్ష మవుతాయి. ఈ పని చేయకుండా సాధారణ స్థాయి నేత వలె కాలేజీ భూముల వ్యవహారంలో సింపుల్ కామెంట్ పాస్ చేసి చేతులు దులుపుకోవచ్చు అనుకున్నారు షబ్బీర్ అలీ.
ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని రమణ రెడ్డి...అప్పటికే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా అవతరించినా కామారెడ్డి బల్దియా పగ్గాలు మిస్సయానన్న కాక మీద ఉండు.కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు అయ్యింది రమణ రెడ్డికి. కాలేజీ భూములు కేటాయింపు పై షబ్బీర్ అలీ కామెంట్స్ పై రెచ్చి పోయి.. పనిలో పనిగా షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులను వివాదం లోకి లాగారు. అంతటితోనే ఆగకుండా బహిరంగ చర్చకు రమ్మంటూ కవ్వించారు రమణ రెడ్డి..
చర్చకు తాను వెళ్తే రమణ రెడ్డి అంతస్తు అమాంతం పెరిగిపోతుందనుకున్నారు షబ్బీర్ అలీ.
నా అనుచరులే చాలు అనుకున్నారు.లంక దహనం కోసం వెళ్లిన హనుమంతుడి వలె ఆకాశ మంత ఉహించుకున్న షబ్బీర్ అలీ అనుచరులు ఏకంగా రమణ రెడ్డి ఇంటికే వెళ్లారు.వీపులు పగిలాయి.ఎక్కి పోయిన కారు తుక్కుతుక్కు అయ్యింది.చర్చకు రాక పోగా షబ్బీర్ అలీ దాడికి పంపారంటూ రమణ రెడ్డి కోడై కూసిండు. ఇంకేముంది కమలం సేనాని రామచంద్ర రావ్ తో పాటు ఉద్దండులు కామారెడ్డి బాట పట్టారు.. బద్నాం షబ్బీర్ అలీ వంతయింది.సానుభూతి రమణ రెడ్డి సొంత మయ్యింది.
అంతటితో ఆగకుండా తన కండక్టు సర్టిఫికెట్ కోసం సర్కార్ తలుపు తట్టారు రమణ రెడ్డి. రికార్డుల ప్రాతిపదిక గీత దాటి అక్రమాల మరక అంటించకుంటే కాంగ్రెస్ పరువు గంగ పాలే .ఈ సాహసం చేస్తే అధికారులకు శంకరగిరి మాన్యాలే. అట్లా అని వెంకట రమణ రెడ్డికి క్లిన్ చిట్ ఇయ్యాల్సి వస్తే కాంగ్రెస్ కు ఆత్మహత్య సదృశ్యమే. ఇట్లాంటి ఇరకాటంలో పడింది కాంగ్రెస్.. ఏతా వాతా తేలింది ఏమిటంటే సిగమూగి సిగ్గు పోగొట్టుకోబోతోంది.
కాంగ్రెస్ పరిస్థితి భస్మాసుర హస్థానికి దగ్గరగా ఉంది.
ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నామనేది కాదు ముఖ్యం.. సందర్బోచితంగా వ్యవహరించడం ముఖ్యమని గుర్తించాలి.ఉరకలెత్తే సలసల మరిగే రక్తం పారే నవతరం నేతలను తక్కువ అంచనా వేస్తే కనుమరుగు అవ్వడం కామన్ ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో..
గుర్తెరిగి మసులుకుంటారో..కోడి గుడ్డు మీద ఈకల కోసం కుస్తీ పడతారో మీ ఇష్టం..
- Get link
- X
- Other Apps