మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు. NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...