Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన..

Image
వందేమాతరం సామూహిక గీతాలాపనకు వేదిక కానుంది హైదరాబాద్ రవీంద్రభారతి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వందేమాతరం సామూహిక గీతా లాపనకు రిహార్సల్ పూర్తి అయ్యింది. హైదరాబాద్ లోని ఈస్టు మారెడ్పల్లి భక్త రామదాసు నృత్య,సంగీత ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు ఈ సామూహిక గీతాన్ని ఆలపించేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ మహావాది సరిత నేతృత్వంలో రిహార్సల్స్ పూర్తి అయ్యాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంకింగ్ చంద్ర రాసిన వందే మాతరం దేశ భక్తి పాట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక గీతా లాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ గీతాలాపనకు లెక్చరర్లు అనిల్ కుమార్, నాగేశ్వర్ రావ్,ప్రశాంత్ వాద్య సహకారం అందచేస్తారని సరిత వివరించారు.. . రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, డైరెక్టర్ పాల్గొంటారు.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

వీర హనుమాన్ విజయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Image
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర రూట్ మ్యాప్ ను మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. స్థానిక కోడూరు హనుమాన్ ఆలయం నుండి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులతో కలిసి పెద్ద బజార్,నిజాంసాగర్ చౌరస్తా, జీవధాన్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, కొత్త బస్టాండ్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ధర్మశాల, సుభాష్ రోడ్డు, పాంచ్రస్తా హరిజనవాడ, రూట్ లో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్పీ, సిఐ, విద్యుత్తు, మున్సిపల్, ఆర్ అండ్ బి తదితర అధికారులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుపబడే వీర హనుమాన్ విజయాత్ర ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఎఎస్పీ చైతన్య రెడ్డి లకు అందచేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆధార నిత్యానందం,కార్యదర్శి బొల్లి రాజు, ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్ రావు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, ఏకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ...

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. సమిష్టి కృషికి కలెక్టర్, సీపీ పిలుపు

Image
నిజామాబాద్, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. ...

పసుపు పంట వర్షార్పణం.. -రైతుకు తీరని నష్టం

Image
నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు మొత్తంగా 16,900 క్వింటాళ్ల పసుపు వచ్చింది. మార్కెట్కు వచ్చిన పసుపు కొమ్ములను దాదాపు 70 నుంచి 80శాతం వరకు షెడ్లలో ఉంచుతున్నారు. అయితే ఎక్కువగా పసుపు యార్డ్కు రావడంతో మార్కెట్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ కొమ్ములను ఉంచారు. కాని సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి యార్డులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు పూర్తిగా తడిసిపోయింది. నీళ్లలో మునిగిపోయింది. వర్షాలను ముందుగానే పసిగట్టి ముందుగానే రైతులు టార్పాలిన్లతో పసుపును కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాలి దుమారంతో కూడిన వర్షం పడడంతో పసుపు పూర్తిగా తడిసిపోయింది.మార్కెట్కు ఎక్కువ మొత్తంలో పసుపు రావడంతో నష్టం ఏర్పడింది. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం.. కందకుర్తి ఘాట్‌ను కలెక్టర్ పరిశీలన

Image
నిజామాబాద్, వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏమేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్ కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందు...

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం: అసెంబ్లీలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

Image
ఇందూరు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాదిరిగానే పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఇటీవల పోలీసులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశారని, ఇటీవల హైదరాబాదులోనూ దాడులు జరిగాయని గుర్తు చేశారు. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం సంతోషదాయకనన్నారు. గతంలో పెద్దపల్లి లో జంట న్యాయవాదుల హత్య అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే ఇటీవల మహిళా అడ్వకేట్ ను హత్య చేయడం, ఇందూరులో కొందరు గుండాలు అడ్వకేట్ సొంత ఇంటిపై దాడి చేయడం ..ఇలా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బిల్లు తీసుకురావడం సంతోషక మని స్పష్టం చేశారు. Follow Our WhatsApp Channel

కలెక్టరేట్‌లో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం.. ఉద్యోగులకు ఉపశమనం

Image
📍 నిజామాబాద్, కలెక్టరేట్ లో ఉచిత అంబలి పంపిణీని ప్రారంభించిన కలెక్టర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ ప్రతినిధులు కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. Follow Our WhatsApp Channel

ఇద్దరిదీ దొడ్డిదారే.. దాయాదుల దోస్తాన..

Image
రహస్యంగా కార్పొరేషన్ సమావేశం.. ప్రజాస్వామ్యానికి విఘాతం? పార్లమెంట్ కన్నా స్థానిక పాలన వ్యవస్థలకు ప్రజాస్వామ్యంలో,రాజ్యాంగ స్ఫూర్తిలో పెద్దన్న పాత్ర.. కానీ ఆ స్ఫూర్తిని BRS సర్కార్ నిలువు పాతర వేయగా.. రాజకీయాల్లో దాయాదిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పాత సర్కారు ఒరవడిని కొనసాగించడం విశేషం.. ప్రజా పాలన ట్యాగ్ లైన్ ను అన్ని వేదికలపై అరగిన గ్రామ ఫోన్ రికార్డు వలె వల్లించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు.. తెలంగాణలో మునిసిపల్ పాలక వర్గ సమావేశాలను రహస్యంగా నిర్వహించే చెత్త సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. నిజామాబాద్ కార్పొరేషన్ తొలి పాలక వర్గ వసమావేశం పోలీసు పహారాలో జరిగింది. .సమావేశం ప్రధాన ద్వారం మూసేసి..ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. కిటికీలు సైతం మూసేసారు.. లోపల జరిగే చర్చలు బయటకు వినబడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. దర్వాజాలు బందు పెట్టి ప్రజా బిసమస్యలను చర్చించాల్సిన అగత్యం ఎందుకు? ప్రజా సమస్యలపై చర్చను నేరుగా ప్రజలకు చేరనియ్యకుండా ఉండేందుకు మీడియాను అనుమతించలేదు.. పారదర్శకంగా,పబ్లిక్ ఉన్నది ఉన్నట్లు తేలుసుకునే హక్కును హరిస...

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఖబర్దార్: కవితపై బీజేపీ నేత దాంపల్లి జ్యోతి ఫైర్

Image
నిజామాబాద్, కల్వకుంట్ల కవిత మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ దాంపల్లి జ్యోతి కవితపై ఘాటుగా విమర్శలు చేశారు. లిక్కర్ కేసులో కోట్లు సంపాదించిన మీరు కొత్త పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ఎందరో యువతీ యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను పదేళ్ల పాలనలో మీ డాడీ సగం తెలంగాణను నాశనం చేస్తే మీరు కొత్త పార్టీ అంటూ మిగిలిన సగాన్ని నాశనం చేసేందుకు వస్తున్నారని ఆమె ఆక్షేపించారు. మీ సొంత ఇంట్లోనే మీకు చక్కగా లేదని అలాంటిది రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని , కొత్త పార్టీ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని దాంపల్లి జ్యోతి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో కొత్త పార్టీ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని జ్యోతి దుయ్యబట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తుంటే చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ పై అవాకులు చవాకులు పేల్చడం సిగ్గుచేటు అన్నారు. ...