PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎ తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు. 20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ ...