Posts

Showing posts with the label KCR

ఆటో కార్మికుల సమస్యలపై గణేష్ బిగాల భారీ ర్యాలీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Image
ప్రజా వంచన పాలనఇది -బిగాల గణేష్ ఆగ్రహం నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో గణేష్ బిగాల ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిర్ణయాల వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిని, వారి పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం లేక నిత్యం తిండికి కూడా ఇబ్బందులు పడుతూ, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో సోదరులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నగరంలో పారిశుధ్య లో...

22A భూముల జాబితాతో ప్రజలు ఇబ్బందుల్లో.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై గణేష్ బిగాల విమర్శలు

Image
. "నిషేధిత" కుట్రతో భూములను మింగాలని స్కెచ్ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం గణేష్ బిగాల నిర్వహించారు. 22A నిషేధిత జాబితాతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని గణేష్ బిగాల మండిపడ్డారు. - ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. - 22A జాబితాలో భూములు చేరడంతో వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వంటి లావాదేవీలు నిలిచిపోతున్నాయని తెలిపారు. - 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు వంటి రక్షించాల్సిన భూములను నిషేధిత జాబితాలో ఉంచే ఉద్దేశం ఉందని, అయితే ప్రైవేట్ వ్యక్తుల...

తనతండ్రిని పాపిన ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించను.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Image
నిజామాబాద్ : తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సాధించుకుంటే జీవితాలు మారిపోతాయని భావించి ప్రజలకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని ఆమె అన్నారు. సోమవారం నిజామామాబాద్ లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగిండ్లు మాత్రమే బంగారు మాయమయ్యాయని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాల్సిన అవసరముందని అందుకోసం సామాజిక న్యాయ తెలంగాణ అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం 20 ఏళ్లు కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి నిర్దాక్షణ్యంగా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం పార్టీ పెట్టలేదని తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం పంతం పట్టి పార్టీ పెట్టానని అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత సొంతూరు నిజామాబాద్ కు రావటం సంతోషంగా ఉందని కవిత అన్నారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీ ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఆశీర్వాదం ఇవ్వాలని కవిత నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి ...

బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

Image
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంట...

తెలంగాణ ప్రజలపై విషం చిమ్మిన భాజపా ఎంపీ తేజస్వి సూర్య

Image
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని భాజపా బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మడం తెలంగాణ ఆస్తిత్వంపై దాడిగా నిజామాబాద్ భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని విభజించడాన్ని దేశ విభజనతో పోల్చడం అతని అజ్ఞానానికి పరాకాష్టగా అభివర్ణించారు. కేసీఆర్ మలిదశ ఉద్యమంతో సకల జనులు కలిసి వచ్చిన చారిత్రాత్మక పోరాటాన్ని కించపరచడమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలను అవమానించిన భాజపా ఎంపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర ఆధిపత్య శక్తుల తొత్తుగా మారిన తేజస్వి సూర్యను తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవంపై, తెలంగాణ ఆస్తిత్వంపై భాజపా ఎంపీ విషపు గుళికలు విసిరి వేయడం సూర్యలో ఉన్న కపటత్వానికి నిదర్శనమని మధుసుధన్ రావు అన్నారు. సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

Image
తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు. ...

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు

Image
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి ని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు కేసీఆర్. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట ,సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు...