నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి ని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు కేసీఆర్. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట ,సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్