తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు.

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!