తెలంగాణ ప్రజలపై విషం చిమ్మిన భాజపా ఎంపీ తేజస్వి సూర్య

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని భాజపా బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మడం తెలంగాణ ఆస్తిత్వంపై దాడిగా నిజామాబాద్ భారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని విభజించడాన్ని దేశ విభజనతో పోల్చడం అతని అజ్ఞానానికి పరాకాష్టగా అభివర్ణించారు. కేసీఆర్ మలిదశ ఉద్యమంతో సకల జనులు కలిసి వచ్చిన చారిత్రాత్మక పోరాటాన్ని కించపరచడమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలను అవమానించిన భాజపా ఎంపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర ఆధిపత్య శక్తుల తొత్తుగా మారిన తేజస్వి సూర్యను తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఆత్మగౌరవంపై, తెలంగాణ ఆస్తిత్వంపై భాజపా ఎంపీ విషపు గుళికలు విసిరి వేయడం సూర్యలో ఉన్న కపటత్వానికి నిదర్శనమని మధుసుధన్ రావు అన్నారు. సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్