Posts

Showing posts with the label mahesh kumar goud

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Image
* కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ * ........... టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి. సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మం...

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

Image
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎ తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు. 20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ ...

పీసీసీ చీఫ్ తో తెలంగాణ ఉద్యమకారుల భేటీ

Image
నిజామాబాద్; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందువరుసలో ఉన్న ఉద్యమకారుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధి బృందం కలిసింది. అక్రమ కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ సాధనలో పనిచేసిన ఉద్యమకారులు నిరాదరణకు గురవుతున్నారని మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రణాళికను ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సొంతింటి కోసం 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షున్ని కోరారు. ఫించన్లు ఇచ్చి ఆదుకోవాలను కోరారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ తోపాటు పుప్పాల రవి,శ్రీనివాస్ గౌడ్,పులి జైపాల్, మేతిరి రాజశేఖర్,జ్వాల రాణి, బర్రికుంట శ్రీనివాస్,సల్ల ప్రవీణ్ ఉన్నారు.

జర్నలిస్టులకు పక్కాగా ఇండ్ల స్థలాలు.. Pcc చీఫ్ మహేష్,షబ్బీర్ అలీ

Image
తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని pcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించన తరువాత వారు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుతామని మహేష్ కుమార్ గౌడ్,షబ్బీర్ అలీ చెప్పారు.ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వారు గుర్తు చేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం ఇవ్వాళ సాయంత్రం కలెక్టర్ ను పిలిచి మాట్లాడుతామని వారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పని చేసిన జర్నలిస్టులకు ప్రజా పాలనలో మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లు సైతం కాంగ్రెస్ అధికారమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.380 కోట్లతో టెంపుల్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు మహేష్ చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తా...

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

Image
ఎప్పుడూ సీరియస్గా కనపడే ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం మ్యూజిక్ కు మైమరచిపోయిన అరుదైన సందర్భం ఆవిష్కతం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శివారులోని రిసార్ట్ లో జరిగింది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ప్రధానం సందర్భంగా ఒక నాయకుడు హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ వేదిక పైకి ఎక్కారు.. మేడం నటరాజన్ పక్కనే నిలబడి ఉన్న నాయకుడు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేస్తుండగా.. వేదిక పైకి ఎక్కిన నాయకుడు శృతి కలిపారు. ఇద్దరు నేతలు స్టెప్పులు వేయడంతో పక్కనే ఉన్న ఆలిండియా కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సైతం కాళ్లతో తప్పెట్లు వేశారు..మ్యూజిక్ కు తగ్గట్టు మేడం అటూ ఇటూ కదలగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చప్పట్లు కొడుతూ జోష్ ను మరింత పెంచారు..

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ పదేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టబోతోంది. దీనికోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఫలితాలు వెలువడిన తరువాత శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులు,కార్పిరేటర్లతో భేటీ అయి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గత పదేళ్లు BRS అనుసరించిన పొలిటికల్ ఫార్ములనే అనుసరించి MIM తో జాతకట్టాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.. ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గమేమి లేదనే అంచనాకు వచ్చారు మహేష్ గౌడ్. మజ్లీస్ తో జతకటితే మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ను చేరుకునే తప్పని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మునిసిపల్ లో గతంలో కంటే 15 సీట్లు ఎక్కువగా సాధించింది.17 సీట్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను పొందాలంటే ఇంకా 14 మంది సంఖ్యా బలం అవసరముంది. కరెక్టుగా..కాకతాలియంగా MIM ఈ సారి 14 సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది..ఇక ఎక్సఫీపియో ఓట్లతో పనిలేకుండా MIM తో జతకట్టి మేయర్ పదవిని సొంతం చేసుకోబోతోంది కాంగ్ర...