Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

జమాల్పూర్ గణేష్.... ✍︎
పదేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలనా పగ్గాలు చేపట్టబోతోంది. దీనికోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు.
ఫలితాలు వెలువడిన తరువాత శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులు,కార్పిరేటర్లతో భేటీ అయి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
గత పదేళ్లు BRS అనుసరించిన పొలిటికల్ ఫార్ములనే అనుసరించి MIM తో జాతకట్టాలని సూత్ర ప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.. ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయ మార్గమేమి లేదనే అంచనాకు వచ్చారు మహేష్ గౌడ్.
మజ్లీస్ తో జతకటితే మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ను చేరుకునే తప్పని పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ మునిసిపల్ లో గతంలో కంటే 15 సీట్లు ఎక్కువగా సాధించింది.17 సీట్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను పొందాలంటే ఇంకా 14 మంది సంఖ్యా బలం అవసరముంది. కరెక్టుగా..కాకతాలియంగా MIM ఈ సారి 14 సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది..ఇక ఎక్సఫీపియో ఓట్లతో పనిలేకుండా MIM తో జతకట్టి మేయర్ పదవిని సొంతం చేసుకోబోతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో
ఇంకేముంది MIM తో దోస్తానకే జై కొట్టింది మహేష్ గౌడ్ తో భేటీ అయిన ముఖ్య నాయకత్వ గణం. దీన్ని ఆచరణంలో పెట్టేందుకే మొగ్గు చూపిన మహేష్ గౌడ్ ఇక్కడి రాజకీయ సమీకరణాలు, సంఖ్యా సమికరణాలను CM రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పి CM సమ్మతిని సాధించేందుకు శనివారం భేటీ అయ్యేందుకు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లనున్నారు.


మజ్లీస్ తో జతకడతారా..ముందుగా ప్రకటించినట్లు బీజేపీకి ఎంత దూరమో MIM కి అంత దూరమేనన్న మాటకు కట్టుబడి ఉంటారా అని శుక్రవారంనాడు నిజామాబాద్ లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పక పోవడం గమనార్హం.
నిజామాబాద్ వాసిగా నా స్వార్థ మ్ నాకు ఉంటది..నిజామాబాద్ అభివృద్ధి కోసం మేయర్ పదవి అవసరం అంటూనే..పొలిటికల్ ఎఫైర్స్ కమిటితో చర్చించి MIM తో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటామని PCC చీఫ్ చెప్పారు. కానీ MIM తో పొత్తు ఉండదని ఖరాఖండిగా చెప్పకపోవడంతో పొత్తు ఖాయమనే అన్యోపదేశంగా తేల్చిచెప్పారు మహేష్ కుమార్ గౌడ్..
బీజేపీ మళ్ళీ 28 స్థానాలకే పరిమితం కావడం వల్ల కాంగ్రెస్, మజ్లీస్ పొత్తుకు మార్గం సుగమం అయ్యింది. మరో 3 సీట్లు గనక వస్తే అవుట్ రైట్ గా నిజామాబాద్ కార్పొరేషన్ పాలన పగ్గాలు ఎంపీ అర్వింద్ నాయకత్వంలో బీజేపీ చేతికి చిక్కేది..

Popular posts from this blog

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన