Posts

Showing posts with the label telangana

మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్

Image
**మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం** **పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు** ఆగస్టు 7 మండల్ డే ను పురస్కరించుకొని నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ విగ్రహ ప్రతిపాదిత స్థలం (బీజేఆర్ చౌరస్తా )లో బిపి మండల్ చిత్రపటానికి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసిన అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య(SDF)చైర్మన్ శ్రీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం 1990 ఆగష్టు 7 న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలు నోచుకోకపోవడం ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలోని పాలకవర్గ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి ఓబీసీల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు. ఒకవైపు సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటాకావాలంటూ ప్రజలు పోరాడుతుంటే కనీసం ఉన్న హక్కులను కూడా కాలరాసే విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి దోచిపెడుతూ నిజమైన భూమిపుత్రులైన సకల సంపదల సృష్టికర్తలైన ఓబీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మరోవైపు రిజర్వేషన్ హటావో పేరుతో ఇప్పటిక...

ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభలు విజయవంతం చేయండి.. పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ

Image
  6న గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయండి..  పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ.. సిద్దిపేట, ఆగస్టు 3. ఈనెల 6 న సిద్దిపేటలో, హైదరాబాద్ లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వర్ధంతి సభ పోస్టర్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమం లో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో చైర్మన్ ఆస లక్ష్మణ్,TPTF రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, ప్రజాగాయకులు భీమసేన, చికోటి నర్సింలు, అవని పత్రిక సంపాదకులు కూతురు రాజిరెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి సిద్దెంకి యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య,BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కంకిటి నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య, BRS నాయకులు గుండు శ్రీనివాస్, తెలిజీరు శ్రీనివాస్ యాదవ్, గడీల రమేష్ రెడ్డి, చిటుకుల మైసా రెడ్డి తదితరులు కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ ...

అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా.. ఎంబీబీఎస్ ఫీజులన్నీ నేనే భరిస్తా అని హామీ

Image
• అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా .................. • నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో హరీష్ రావును ఆశ్రయించిన అఖిల. • 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే దాకా మెరీడియన్ విద్యాసంస్థల్లో చదివించిన మాజీమంత్రి . • ఇటీవల డాక్టర్ చదువు కోసం నీట్ పరీక్ష రాసిన అఖిల. • తన ఇంటికి ఆత్మీయంగా ఆహ్వానించడమేగాక అన్నం పెట్టి ఆత్మీయ భరోసా అందించిన మాజీ మంత్రి. • ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా తానే ఫీజు కట్టి చదివిస్తానని మనోధైర్యం కల్పించిన హరీష్ రావు గారు. • తండ్రి ని కోల్పోయి ఆర్థిక స్థోమత లేక ఆందోళన లో ఉన్న నిరుపేద బిడ్డకు అండగా హరీష్ రావు గారు • పేద విద్యార్థులకు పెద్దదిక్కుగా నిలిచి మరో సారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు. " హరీష్ రావు గారు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో అదుకొనే అపద్భాందవుడు... అన్న ల ఆత్మీయత నీచ్చే నాయకుడు.. అభివృద్ధి కి నిలువుటద్దం ఆయన.. కష్టం వచ్చింది అంటే నేను ఉన్న అని భరోసా నిచ్చే నేత... సిద్దిపేట కుటుంబ సభ్యుడిగ నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే ప్రజా నాయకులు ఇలా హరీష్ రావు గారి గురించి ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్న సరిపోనంత అభిమానం చాటుక...

"సచ్చిపోబుద్ధి అవుతుంది.." SIR సర్వేలో బీఎల్‌వోల ఆవేదన.. కమిషనర్ జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి

Image
*హలో.. బలే* *సచ్చిపోబుద్ధి అవుతుంది..* *బి ఎల్ ఓ ల భావోద్వేగం.... కమిషనర్ గారు జర కన్నేయండి* వాయిస్ ఓవర్... హలో హలో మీ పేరు ఇదేనా అండి... నేను మీ బి ఎల్ వో ని మీ డివిజన్ పరిధిలో అంగన్వాడి ఫోన్ చేస్తున్నామండి. దయచేసి ఇక్కడికి వచ్చి సర్ తీసుకోండి.. నేను నేను వేరే చోట ఉన్నాను అనేది ప్రతి సమాధానం. పర్వాలేదండి మీ దగ్గరలో ఉన్న ఏదైనా చౌరస్తాకు రండి నేను ఇస్తా అనేది బి ఎల్ ఓ ఎదురు జవాబు. దీన్ని యవ్వ చచ్చిపోవాలనిపిస్తుంది. అనేది నిజాయితీ బిఎల్ఓ ల భావోద్వేగం. ఎలాగోలా ప్రత్యుత్తమరాలు నడుస్తున్నాయి. ఏదోరకంగా సర్ పాo ను అందుకున్న ఓటర్లు జాబితా అంతంత మాత్రమే ఇంకా కేవలం నాలుగు రోజులే కానీ చిక్కుముడని సమస్యలు లెక్కలేనివి. సదరు ఇంటి యజమాని లో అంతా అయోమయోమే.. చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి తేడా ఏమీ లేదు. సర్ ఫారం లు నింపడం అన్ని డాలర్ల ప్రశ్నార్థకమే... ఇంకేముంది సర్ పత్రం అందుకున్న దారుడు హడావిడిగా పరిగెత్తి మీసేవ, బాగా చదువుకున్న వారి చుట్టూ పరిగెడుతూ నానా టంటలు పడుతూ ఉంటారనేది నేటి నిజం. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కి తెలిసిన, ఉన్నత అధికార యంత్రాంగానికి తెలిసిన ఏమీ తెలియనట్లు ఉండడం కాకపోతే గ్రామ...

మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

Image
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్...

భాషకు ప్రాణం పోసిన అక్షర సేనాని... తెలిదేవర భానుమూర్తికి కన్నీటి వీడ్కోలు

Image
తెలంగాణ మట్టి వాసనను, ఆ భాషా సౌందర్యాన్ని హిమాలయమంత ఎత్తున నిలబెట్టిన నా ఆత్మీయ మిత్రుడు తెలిదేవర భానుమూర్తి (73) గారు మల్కాజ్‌గిరిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్షరం ముక్కలైనట్లు, ఒక భాషా నిధి కనుమరుగైనట్లు నా మనసు విలపిస్తోంది.  తెలంగాణ భాషకు అస్తిత్వ శిఖరం హైదరాబాద్‌ గల్లీల్లో వినిపించే సామాన్యుడి గొంతును, ఆ భాషలోని నుడికారాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, తెలంగాణ యాసను, ఆ అస్తిత్వాన్ని తన ఊపిరిగా మలచుకున్న నిఖార్సైన కవి, జర్నలిస్ట్ ఆయన. 1995లో 'వార్త' తెలుగు దినపత్రిక ఆరంభంలో నిజామాబాద్ ఎడిషన్‌లో మా ప్రయాణం మొదలైంది. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ గారి సారథ్యంలో... భానుమూర్తి ఎడిషన్ ఇన్‌ఛార్జిగా, నేను ఎడిషన్ చీఫ్‌గా కలిసి అడుగులు వేశాం. "పత్రికా భాష అంటే కేవలం ఒక ప్రాంతానిదే కాదు, అది ప్రజల భాష కావాలని కలలు గన్న సాహితీ మూర్తి ఆయన." ఆ రోజుల్లో వార్తాపత్రికలపై ఒకే తరహా ఆంధ్ర భాషా ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో, తెలంగాణ వాడుక భాషను వార్తా రచనలోకి తెచ్చిన సా...

కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే  బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్...

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

Image
  ✍︎... జమాల్పూర్ గణేష్ :- కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ  చక్కర్లు కొడుతోంది.     కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది..   ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డ...