భాషకు ప్రాణం పోసిన అక్షర సేనాని... తెలిదేవర భానుమూర్తికి కన్నీటి వీడ్కోలు


తెలంగాణ మట్టి వాసనను, ఆ భాషా సౌందర్యాన్ని హిమాలయమంత ఎత్తున నిలబెట్టిన నా ఆత్మీయ మిత్రుడు తెలిదేవర భానుమూర్తి (73) గారు మల్కాజ్‌గిరిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్షరం ముక్కలైనట్లు, ఒక భాషా నిధి కనుమరుగైనట్లు నా మనసు విలపిస్తోంది.

 తెలంగాణ భాషకు అస్తిత్వ శిఖరం
హైదరాబాద్‌ గల్లీల్లో వినిపించే సామాన్యుడి గొంతును, ఆ భాషలోని నుడికారాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, తెలంగాణ యాసను, ఆ అస్తిత్వాన్ని తన ఊపిరిగా మలచుకున్న నిఖార్సైన కవి, జర్నలిస్ట్ ఆయన.

1995లో 'వార్త' తెలుగు దినపత్రిక ఆరంభంలో నిజామాబాద్ ఎడిషన్‌లో మా ప్రయాణం మొదలైంది. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ గారి సారథ్యంలో... భానుమూర్తి ఎడిషన్ ఇన్‌ఛార్జిగా, నేను ఎడిషన్ చీఫ్‌గా కలిసి అడుగులు వేశాం.
"పత్రికా భాష అంటే కేవలం ఒక ప్రాంతానిదే కాదు, అది ప్రజల భాష కావాలని కలలు గన్న సాహితీ మూర్తి ఆయన."

ఆ రోజుల్లో వార్తాపత్రికలపై ఒకే తరహా ఆంధ్ర భాషా ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో, తెలంగాణ వాడుక భాషను వార్తా రచనలోకి తెచ్చిన సాహసి భానుమూర్తి.

ఆయన కలం నుండి జాలువారిన "పలుకుబడి" ఎంతటి సంచలనమో, నా చేత ప్రతి ఆదివారం రాయించిన "ఇందూర్ ఖబర్" కు వచ్చిన ఆదరణ అంతటిది. తెలంగాణ సామెతలు, జాతీయాలు వార్తలకు హెడ్డింగ్‌లుగా పెట్టడం ఆయన చేసిన గొప్ప ప్రయోగం. సామాన్యుడి భాషకు పత్రికా గౌరవం కల్పించిన దార్శనికుడు ఆయన.

భాష ఉన్నంత కాలం... తెలంగాణ నుడికారం బతికున్నంత కాలం తెలిదేవర భానుమూర్తి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది.
మిత్రమా! నీ అక్షరం అజరామరం. నీ భాషా సేవకు శిరస్సు వంచి నమస్కరిస్తూ... నా హృదయపూర్వక నివాళులు.
     --పిట్టల రవీందర్, సీనియర్ జర్నలిస్టు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్