Posts

Showing posts with the label Siddipet

మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్

Image
**మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం** **పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు** ఆగస్టు 7 మండల్ డే ను పురస్కరించుకొని నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ విగ్రహ ప్రతిపాదిత స్థలం (బీజేఆర్ చౌరస్తా )లో బిపి మండల్ చిత్రపటానికి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసిన అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య(SDF)చైర్మన్ శ్రీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం 1990 ఆగష్టు 7 న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలు నోచుకోకపోవడం ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలోని పాలకవర్గ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి ఓబీసీల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు. ఒకవైపు సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటాకావాలంటూ ప్రజలు పోరాడుతుంటే కనీసం ఉన్న హక్కులను కూడా కాలరాసే విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి దోచిపెడుతూ నిజమైన భూమిపుత్రులైన సకల సంపదల సృష్టికర్తలైన ఓబీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మరోవైపు రిజర్వేషన్ హటావో పేరుతో ఇప్పటిక...

ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభలు విజయవంతం చేయండి.. పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ

Image
  6న గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయండి..  పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ.. సిద్దిపేట, ఆగస్టు 3. ఈనెల 6 న సిద్దిపేటలో, హైదరాబాద్ లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వర్ధంతి సభ పోస్టర్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమం లో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో చైర్మన్ ఆస లక్ష్మణ్,TPTF రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, ప్రజాగాయకులు భీమసేన, చికోటి నర్సింలు, అవని పత్రిక సంపాదకులు కూతురు రాజిరెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి సిద్దెంకి యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య,BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కంకిటి నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య, BRS నాయకులు గుండు శ్రీనివాస్, తెలిజీరు శ్రీనివాస్ యాదవ్, గడీల రమేష్ రెడ్డి, చిటుకుల మైసా రెడ్డి తదితరులు కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ ...

అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా.. ఎంబీబీఎస్ ఫీజులన్నీ నేనే భరిస్తా అని హామీ

Image
• అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా .................. • నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో హరీష్ రావును ఆశ్రయించిన అఖిల. • 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే దాకా మెరీడియన్ విద్యాసంస్థల్లో చదివించిన మాజీమంత్రి . • ఇటీవల డాక్టర్ చదువు కోసం నీట్ పరీక్ష రాసిన అఖిల. • తన ఇంటికి ఆత్మీయంగా ఆహ్వానించడమేగాక అన్నం పెట్టి ఆత్మీయ భరోసా అందించిన మాజీ మంత్రి. • ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా తానే ఫీజు కట్టి చదివిస్తానని మనోధైర్యం కల్పించిన హరీష్ రావు గారు. • తండ్రి ని కోల్పోయి ఆర్థిక స్థోమత లేక ఆందోళన లో ఉన్న నిరుపేద బిడ్డకు అండగా హరీష్ రావు గారు • పేద విద్యార్థులకు పెద్దదిక్కుగా నిలిచి మరో సారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు. " హరీష్ రావు గారు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో అదుకొనే అపద్భాందవుడు... అన్న ల ఆత్మీయత నీచ్చే నాయకుడు.. అభివృద్ధి కి నిలువుటద్దం ఆయన.. కష్టం వచ్చింది అంటే నేను ఉన్న అని భరోసా నిచ్చే నేత... సిద్దిపేట కుటుంబ సభ్యుడిగ నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే ప్రజా నాయకులు ఇలా హరీష్ రావు గారి గురించి ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్న సరిపోనంత అభిమానం చాటుక...

సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు అమోఘం.. నా ఏడాది జీతాన్ని ట్రస్ట్‌కు అందిస్తా: హరీష్ రావు

Image
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి లో ' గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ' కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ✳️ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ✳️నిజంగా శ్రీనివాస్ గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ మనకు కనిపించే దేవుడు. ✳️దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ✳️ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వా...

తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

Image
తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు. ...