ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభలు విజయవంతం చేయండి.. పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ

 


6న గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయండి.. 


పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ..

సిద్దిపేట, ఆగస్టు 3.


ఈనెల 6 న సిద్దిపేటలో, హైదరాబాద్ లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వర్ధంతి సభ పోస్టర్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమం లో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో చైర్మన్ ఆస లక్ష్మణ్,TPTF రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, ప్రజాగాయకులు భీమసేన, చికోటి నర్సింలు, అవని పత్రిక సంపాదకులు కూతురు రాజిరెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి సిద్దెంకి యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య,BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కంకిటి నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య, BRS నాయకులు గుండు శ్రీనివాస్, తెలిజీరు శ్రీనివాస్ యాదవ్, గడీల రమేష్ రెడ్డి, చిటుకుల మైసా రెడ్డి తదితరులు కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, కో చైర్మన్ ఆస లక్ష్మణ్ లు మాట్లాడుతూ తన 60 ఏండ్ల జీవితాన్ని ప్రజలకు, ప్రజా యుద్దానికి, పీడిత ప్రజల విముక్తి కోసం అంకితం చేసి, ప్రజలకు తన పాటను అంకితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ భౌతికంగా దూరమై మూడేళ్లు గడుస్తున్నాయని చెప్పారు.. ఆయన భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, ఆయన బోధించిన ఆకాంక్షలు, ఆయన పాట ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు మరణం లేదని తెలిపారు. ఆయన చూపించిన మార్గంలో  అసమ సమాజాన్ని అంతం చేసే వరకు ప్రజల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం గద్దర్ కుమారుడు సూర్యం ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండే షన్ ఏర్పడిందని తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో  6 న హైదరాబాద్ రవీంద్రభారతి లో సాయంత్రం 4 గంటలకు వర్ధంతి సభ జరుగుతుందని తెలిపారు.. అదేరోజు ఉదయం 8 గంటలకు సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రతి పాదించిన స్థలం లో సిద్దిపేట గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు వర్ధంతి కార్యక్రమాల్లో గద్దర్ అభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు,గాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!