సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు అమోఘం.. నా ఏడాది జీతాన్ని ట్రస్ట్‌కు అందిస్తా: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి లో ' గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ' కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ..
✳️ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు.
✳️నిజంగా శ్రీనివాస్ గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ మనకు కనిపించే దేవుడు.
✳️దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది.
✳️ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణ విషయం కాదు.
✳️ఇది శ్రీనివాస్ అంకితభావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనం. అందుకే నేను ఆయనను కనిపించే దేవుడు అని అంటాను.
✳️ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సేవా కార్యక్రమాల కోసమే ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. Charity begins at home అనే మాటను ఆచరణలో చూపిస్తూ, ఎవరో విరాళం ఇస్తే సేవ చేయడం కాదు, తన సొంత సంపాదనను ఖర్చు చేస్తూ, ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఈ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్నారు.
✳️ఈరోజు మనం చిన్నారుల, తల్లిదండ్రుల మాటలు విన్నాం. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కుటుంబం మాట విన్నాం. ఒడిశా నుంచి వచ్చిన కుటుంబం అనుభవం విన్నాం. వారి కళ్లలో కనిపించిన ఆనందం, కృతజ్ఞత, నమ్మకం ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గొప్ప నిదర్శనం.
✳️మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూస్తూ ఉంటాం. కానీ అంతే నీట్‌నెస్, అంతే కేర్, అంతే ప్రేమ, అంతే మంచి ట్రీట్‌మెంట్ నిజంగా అక్కడ అందిస్తున్నారు.
✳️మన దగ్గర చికిత్స పొందిన ఒక తండ్రి మాట విన్నాం. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని పలాస నుంచి వచ్చిన వారి మాట విన్నాం. మన సిద్ధిపేటకు చెందిన చిన్నారి కూడా ఇక్క ఉన్నాడు. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.
✳️ఇందులో మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కాదు. భగవంతుడు మనకు ఈ గొప్ప మానవ జన్మను ఇచ్చినందుకు, మనం కూడా మనకు తోచినంతగా తోటివారికి సహాయం చేయాలి, సహకారం అందించాలి.
✳️అలాంటి సేవాభావాన్ని ఈ ఆసుపత్రిని చూసి, ఇక్కడ జరుగుతున్న సేవలను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
✳️నిజంగా నాకు కూడా ప్రతిసారి ఒక అనుభూతి కలుగుతుంది. ఇది నేను నాలుగోసారి ఈ ఆసుపత్రికి వచ్చి చిన్నారులను, వారి కుటుంబాలను కలుస్తున్నాను. ప్రతి సారి సర్జరీ పూర్తయి ఆరోగ్యంగా బయటకు వస్తున్న ఆ పిల్లలను చూసినప్పుడు నా గుండె ఉప్పొంగిపోతుంది.
✳️మనం చేసిన ఒక చిన్న ప్రయత్నం సమాజానికి ఉపయోగపడుతుంటే, అంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది?
✳️జీవితంలో మనం ఎంత పెద్ద పదవులు అలంకరించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
ఎంత పెద్ద పరిశ్రమలు స్థాపించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
✳️చివరికి శాశ్వతంగా నిలిచేది మనం చేసిన సేవ, మనం చేసిన మంచి పని మాత్రమే. వ్యక్తులు వస్తారు, వెళ్తారు. But work remains. మనం చేసిన మంచి పని ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
✳️అందుకే నేను ప్రతి సంవత్సరం ఈ ఆసుపత్రికి వస్తుంటాను. ఇక ముందు కూడా వస్తాను.
✳️ఈ ఆసుపత్రి చేసే సేవకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. నా ఏడాది జీతం ఈ ట్రస్ట్ కు అందిస్త.
✳️సత్యసాయి సంజీవని ఆసుపత్రి కేవలం ఒక ఆసుపత్రి కాదు, వేలాది కుటుంబాలకు ఇది ఒక దేవాలయం. This is a temple. ఎందుకంటే ఇక్కడ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు.
✳️అప్పుడే పుట్టిన చిన్నారికి గుండెలో రంధ్రం ఉందని, గుండె సమస్య ఉందని తెలిసిన క్షణంలో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి. బిడ్డ పుట్టిందనే ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారిపోతుంది. అలాంటి సమయంలో ఈ ఆసుపత్రి ఆ చిన్నారికి వైద్యం చేసి ప్రాణం పోస్తుంది.
✳️నా దృష్టిలో ఈ ఆసుపత్రి ఒక చిన్నారి గుండెను మాత్రమే కాపాడదు. మూడు గుండెలను కాపాడుతుంది. ఒకటి ఆ చిన్నారి గుండె. రెండోది ఆ తల్లి గుండె. మూడోది ఆ తండ్రి గుండె.
✳️బిడ్డకు ప్రాణం పోయగానే తల్లిదండ్రుల జీవితాల్లో కూడా ఆశ, ధైర్యం, ఆనందం తిరిగి వస్తాయి. అందుకే నేను చెబుతున్నాను… ఈ ఆసుపత్రి మూడు గుండెలను కాపాడుతోంది.
✳️ఈరోజు 500వ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది గొప్ప రోజు. ఈ సందర్భంగా వైద్య బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు.
✳️విజయ్ దేవరకొండ సాధారణంగా విజయం వచ్చిన తర్వాత కొందరిలో గర్వం వస్తుంది. వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ విజయ్ లో నేను చూసింది మాత్రం రాలేదు. ఎంత ఎదిగితే అంత ఒదిగే మనసు.
✳️విజయ్ గారు కేవలం విజయవంతమైన సినీ నటుడు మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. కరోనా సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు. అంతేకాదు, తన కుటుంబం తండ్రి గారి పేరుతో ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నారు.
✳️విజయ్ సత్యసాయి లోనే చదువుకున్నాడు అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు.
✳️సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయం.
✳️అలాంటి సంస్థకు మనందరం తోడుగా నిలవాలి. ఇక్కడి స్థానికులు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించాలి.
✳️నిజంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి. శ్రీనివాస్ తన జీవితాన్నే ఈ సేవకు అంకితం చేశారు. వేలాది చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం తన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కృతజ్ఞతలు చెప్పాలి, అభినందించాలి.
✳️ఇక్కడ చికిత్స పొందుతున్న పిల్లలు ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఎలాంటి తేడా లేకుండా సమానమైన ప్రేమతో, సేవాభావంతో వైద్యం అందిస్తున్నారు. అదే ఈ సంస్థ గొప్పతనం.
✳️ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇది వెలకట్టలేని అనుభూతి. ఒక చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం కంటే గొప్ప సంతోషం మరొకటి ఉండదు.
✳️మన సిద్దిపేట గడ్డపై ఇలాంటి సేవా సంస్థ ఉండటం మనందరికీ గర్వకారణం.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇





Click here to 👆 Follow Our WhatsApp Channel