మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్
**మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం**
**పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు**
ఆగస్టు 7 మండల్ డే ను పురస్కరించుకొని నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ విగ్రహ ప్రతిపాదిత స్థలం (బీజేఆర్ చౌరస్తా )లో బిపి మండల్ చిత్రపటానికి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసిన అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య(SDF)చైర్మన్
శ్రీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం 1990 ఆగష్టు 7 న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలు నోచుకోకపోవడం ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలోని పాలకవర్గ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి ఓబీసీల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు.
ఒకవైపు సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటాకావాలంటూ ప్రజలు పోరాడుతుంటే కనీసం ఉన్న హక్కులను కూడా కాలరాసే విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి దోచిపెడుతూ నిజమైన భూమిపుత్రులైన సకల సంపదల సృష్టికర్తలైన ఓబీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మరోవైపు రిజర్వేషన్ హటావో పేరుతో ఇప్పటికే భూమిని సంపదని పరిశ్రమల్ని మొత్తం దేశ వనరుల్ని తమ గుప్పిట పెట్టుకున్న ఆధిపత్య కుల సంపన్న వర్గాలే తిరిగి ద్రోహం తలపెట్టచూస్తున్నాయి. కాబట్టి ఈ ఆగస్టు 7 న 1990 వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమోదించిన మండల్ కమిషన్ సిఫారసుల్ని ప్రస్తుతం మొత్తం జనాభా నిష్పత్తి ప్రకారం అమలు చేసే వరకు పోరాడాలని మండల్ ఆశయమైన జనాభా నిష్పత్తి ప్రకారం మొత్తం వాటా దక్కేవరకు పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెరకకుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ వర్మగారు, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు బోయ రాములు గారు, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోరే ఎల్లయ్య కురుమ గారు, అఖిలభారత యాదవ్ మహాసభ సిద్దిపేటజిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ గారు, వీరశైవ లింగ బలిజ సమాజం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రశాంత్ గారు, యాదవ విద్యావంతుల వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ మామిళ్ళ రాము యాదవ్ గారు, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నరేందర్ కొత్వాల్ గారు, భట్రాజుల సంఘం జిల్లా అధ్యక్షులు శాలివాహన సంఘం జిల్లా అసోసియేట్ అద్యక్షులు రామచంద్రం గారు, విద్యార్థి సంఘం నాయకులు వి సంతోష్ గారు, యాదవ యువజన విభాగం సిద్దిపేట పట్టణ అధ్యక్షులు బొల్లవేని మహేష్ యాదవ్ గారు వివిధ కుల సంఘాల నాయకులు,ప్రజా స్వామికవాదులు పాల్గొన్నారు
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇


Click here to 👆 Follow Our WhatsApp Channel