Posts

Showing posts with the label mayor

మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

Image
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్...

నిప్పుల కొలిమిలో నిజామాబాద్: చౌరస్తాలో నిమిషం ప్రయాణం.. నరకానికి నిదర్శనం!

Image
ఏప్రిల్ నెలలోనే ఇందూరు నగరం అగ్నిగుండంలా మారుతోంది. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వడగళ్ళు, ఉక్కపోతతో ప్రజల ఊపిరి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఎండల ధాటికి సామాన్యుడు బయటకు రావాలంటేనే వణికిపోతున్నాడు. రోడ్లపై ప్రయాణం ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎదురుచూడటం ఒక మానవీయ సంక్షోభంగా మారుతోంది. 🚦 ఎర్రటి సెగలు.. కరుగుతున్న ప్రాణాలు సిగ్నల్ దగ్గర పడే ఆ 90 సెకన్ల రెడ్ లైట్, వాహనదారులకు శిక్షలా మారుతోంది. చిన్నారుల ఆక్రందనలు: బైకుపై వెళ్లే పసిపిల్లల సున్నితమైన చర్మం ఆ వేడికి కాలిపోతుంటే, వారి ఏడుపు తండ్రి గుండెను పిండేస్తోంది. వృద్ధుల అవస్థలు: శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, ఎండ దెబ్బకు తూలిపోతున్న ముసలి ముతక ప్రజలు.. గ్రీన్ సిగ్నల్ పడగానే "హమ్మయ్య బతికిపోయాం" అని ఊపిరి పీల్చుకుంటున్నారు. రోగుల ఆర్తనాదాలు: హాస్పిటల్ కి వెళ్లే అత్యవసర స్థితిలో ఉన్నవారు, సిగ్నల్ వద్ద ఆ ఒక్క నిమిషం వేడిని భరించలేక విలవిలలాడుతున్నారు. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేంతటి తీవ్రమైన ఈ పరిస్థితిపై 'మన నిజామాబాద్ ఛానల్' తన సామాజిక బాధ్యతగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి...

వంటపనిలోనూ తగ్గేదేలే.. -- కులాంతర ప్రేమ పెళ్లి -- మేయర్ ఉమ తండ్రి ప్రముఖ జర్నలిస్టు

Image
  (జమాల్పూర్ గణేష్, ప్రీతం రెడ్డి) ఆమె నగర ప్రథమ పౌరురాలు.తెలంగాణలోనే అతిపెద్ద మూడవ  మునిపల్ కొర్పొరేషన్ మేయర్గా ప్రమాణం చేశారు.ఆరోజు అంతా బిజీ బిజీగా గడిపారు.నిజామాబాద్ లో బుటిక్ నడుపుకునే అతి సాధారణ సగటు మహిళ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఊహించని ప్రోటోకాల్ పోస్టు సొంతమైంది కూడగాయల ఉమారాణికి..దీనితో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితర ఉద్దండులతో మర్యాద పూర్వక భేటీలు..కాంగ్రెస్ శ్రేణులతో సంబరాల్లో గడిచి పోయింది.మరుసటిరోజు యధావిధిగా ఇంటి పనులు,వంట పనుల్లో నిమగ్నం అయ్యారు నగర ప్రధమ పౌరురాలు..అదే సమయానికి మన నిజామాబాద్ వీడియో జార్నలిస్టు పొద్దుటూరు ప్రీతం రెడ్డి మేయర్ ఇంటి పనుల్లో బిజీ అయిన తీరును చిత్రీకరించారు..   గ్యాస్ స్టవ్ వెలిగించి పప్పుచారు కాస్తూనే.. మరో సైడ్ చాయ్ చేశారు..నడుమ కిచెన్ సర్దడం.పోపు డబ్బాలు,మసాలా దినుసులు క్రమంగా సర్దుకుని ఇల్లాలుగా భాద్యతలు పూర్తి చేసుకున్నరూ. మేయర్ కిచెన్ నుంచి హాల్ లో కొద్ది సేపు టీవీ చూసారు.ఆతరువాత భర్త కరాటే రమేష్ తో కలిసి బంధు మిత్రులతో కలిశారు మేయర్ ఉమారాణి. స్నేహితులు,హితులు వారిద...

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

Image
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.  NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

Image
జమాల్పూర్ గణేష్...✍️  ఎంపీ అర్వింద్ ఏది మాట్లాడినా ట్రిండింగే..మౌనంగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులకు తొండను మింగిన అనుమానమే అంటే అతిశయోక్తి కాదేమో... మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు హిందూత్వ ఎజెండాను గల్లీ గల్లీల్లో విస్తృతంగా ప్రచారం చేసి సింగిల్ హ్యాండ్ తో 28 సీట్లను సంపాదించిన అర్వింద్ నడవడిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..  నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల మరుసటిరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ఎదురు చూశాయి అనేక వర్గాలు.. ఈ అంచనకు భిన్నంగా గంభీరంగా, రెండు మూడు అంశాలకే పరిమితము అయ్యారు.28 సీట్లు తక్కువేమీ కాదంటూనే ప్రతిపక్షంలో కూర్చుంటామని సాదా సీదాగా చెప్పి ,మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై ప్రస్తావనకే పరిమితం అవ్వడంపై కూడా చర్చ సాగుతోంది. సహజమైన నైజానికి భిన్నంగా అర్వింద్ కూల్ గా ,గుంభనంగా, శాంతంగా కనబడడం కూడా ప్రత్యర్థి పార్టీల్లో చర్చకు తావిచ్చినట్లు స్పష్టమైతోంది.ఇది ఎంతదాక పోయిందంటే ఆయనతో తిరిగే కమలం ముఖ్య కార్యకర్తలు సైతం సోమవారంనాడు మేయర్ ఎన్నికలో ఏమి జారుగుతాదో చూడండి అనేదాక పోయింది అర్వింద్ ...

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది. అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక.. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్... స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్.. మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను    ఓడించేందుకు  అనేక పాచికలు వేశారు.. ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది.. కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా ...