Posts

Showing posts with the label Kamareddy News

జర్నలిస్టు కూతురు అనన్య స్టేట్ ర్యాంకర్.. CECలో 982 మార్కులతో మూడో స్థానం

Image
కామారెడ్డి కి చెందిన మున్నం అనన్య పట్టణంలోని VRK కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో CEC Group నుంచి 1000 Marks కు గాను 982 మార్క్స్ సాధించింది రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించింది. రాష్ట్ర టాపర్ కు 985 మార్క్స్ వచ్చాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోను స్టేట్ లో రెండవ ర్యాంక్ సాధించింది. IAS లక్ష్యంగా తాను CEC Group ను ఎంచుకొని శ్రమిస్తున్నట్లు ఈ సందర్బంగా అనన్య తెలిపింది. అనన్య తండ్రి మున్నం శ్రవణ్ కుమార్ 25 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. తల్లి మున్నం రాధ గృహిణి .తమ బిడ్డ ఇంటర్ లో అనుకున్న స్థాయిలో మార్క్ లు ర్యాంక్ ను సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ కూతురు IAS లక్ష్యంగా కష్టపడి చదువుతొందని ,తన లక్ష్యం చేరుకొనేలా వెన్నంటి తోడ్పాటు నిస్తామని ఈ సందర్బంగా చెప్పారు.తమ పెద్ద కూతురు నిహారిక సైతం SRK విద్యసంస్తల్లొ చదివి ఇంటర్ MPC లో 950 పైగా మార్క్ లు సాధించి EAPCET లో మంచి ర్యాంక్ సాధించి నల్లమల్లారెడ్డి కాలెజిలొ ఫ్రీ సీట్ సాధించి CSE AI Group లొ B.Tech సెకండ్ ఈయర్ చదువుతోంది. తమ ఇద్దరు కూతుల్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతుండడం పట్ల త...

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ -దోమకొండలో షబ్బీర్ అలీ

Image
కామారెడ్డి , దోమకొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి షబ్బీర్ అలీ వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మండల అభివృద్ధిలో భాగంగా రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దోమకొండలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. దోమకొండ మండల...

మహిళలను కోటీశ్వరులను చేస్తాం: కామారెడ్డిలో షబ్బీర్ అలీ హామీ

Image
📍 కామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.52 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 👉 డ్వాక్రా మహిళల కోసం రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి, 👉 పిల్లల సంక్షేమం కోసం రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం, 👉 గ్రామ అభివృద్ధి కోసం రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 💬 ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచి కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు సుతారి రమేష్, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డీసీసీ ఉపాధ్యక్షులు గం...

ఆశా వర్కర్లకు పరిష్కారం లేకపోతే చలో అసెంబ్లీ

Image
కామారెడ్డి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అంగన్వాడీ లు సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వంలో వారు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటకు పైగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్ ముదం అరుణ్ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కనీస వేతనం 18000 లు అమలు చేస్తామనిఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పని భద్రత హామీ కూడా ఇప్పటికే అమలు కాలేదన్నారు.ఎన్నికల్లో మాతో పని చేయించుకుని పారితోషికం ఇవ్వలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి బకాయిల విడుదల చేయాలని అన్నారు. పి ఎఫ్ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుదీర్ఘంగా మాట్లాడిన షబ్బీర్ ఆలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర...

పోలీసు దాడిలో ఆశ వర్కర్లకు గాయాలు

Image
*సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం *భారీ కేట్లను పక్కకు జరిపి గేటు వద్ద ఆందోళన నిర్వహించిన ఆశ వర్కర్లు, CITU నాయకులు *పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశా వర్కర్లు *మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని సస్పెండ్ చేసే అరెస్టు చేయాలని డిమాండ్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆశ వర్కర్లు సిఐటియు నాయకులు భారీ కేట్లను తోసేసి కలెక్టరేట్ గేటు ముందుకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్, ముదం అరుణ్ లు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుదామని వెళితే పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తత కి దారితీసిందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఇష్...

ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

Image
కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద...