ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ లక్ష్యాలు, కార్యాచరణ విధానం గురించి స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్