అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ -దోమకొండలో షబ్బీర్ అలీ

కామారెడ్డి ,
దోమకొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి షబ్బీర్ అలీ వివరంగా ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
మండల అభివృద్ధిలో భాగంగా రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే దోమకొండలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. దోమకొండ మండలాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
నాడు ఇచ్చిన మాట ప్రకారం, ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మనం ప్రకటించిన "ఆరు గ్యారెంటీలను,చిత్తశుద్ధితో అమలు చేస్తూ, సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని , 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఆడబిడ్డల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామన్నారు.
ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ, చీకటి గదుల్లో వెలుగులు నింపుతున్నామని,
​సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.
​వృద్ధులకు, వితంతువుల అర్హులైన లబ్ధిదారులకు, పెన్షన్ అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని చెప్పారు.
​రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరాకు 12,000 రైతులకు కూడా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.
​సంక్షేమమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనలో మనం రాజీ పడటం లేదని, రోడ్ల విస్తరణ, విద్యా సంస్థల బలోపేతం , వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని వివరించారు. ముఖ్యంగా మన ప్రాంతంలో మెడికల్ కాలేజీల అభివృద్ధి , సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. అవినీతి లేని పాలనను అందిస్తూ, ప్రతి కార్యకర్తను, ప్రతి పౌరుడిని భాగస్వాములను చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, గ్రామ సర్పంచ్ నరసయ్య, తిరుమల గౌడ్, పాత రాజు, అనంతరెడ్డి,నర్సింగరావు, సుతారి రమేష్, మధు ఐరేణి సందీప్,పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, దేవరాజ గౌడ్,స్వామి, శ్రీనివాస్, శంకర్ రెడ్డి, శ్రీకాంత్ , పుల్ల బోయిన రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్