Posts

Showing posts with the label nizamabad

మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

Image
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్...

నిప్పుల కొలిమిలో నిజామాబాద్: చౌరస్తాలో నిమిషం ప్రయాణం.. నరకానికి నిదర్శనం!

Image
ఏప్రిల్ నెలలోనే ఇందూరు నగరం అగ్నిగుండంలా మారుతోంది. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వడగళ్ళు, ఉక్కపోతతో ప్రజల ఊపిరి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఎండల ధాటికి సామాన్యుడు బయటకు రావాలంటేనే వణికిపోతున్నాడు. రోడ్లపై ప్రయాణం ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎదురుచూడటం ఒక మానవీయ సంక్షోభంగా మారుతోంది. 🚦 ఎర్రటి సెగలు.. కరుగుతున్న ప్రాణాలు సిగ్నల్ దగ్గర పడే ఆ 90 సెకన్ల రెడ్ లైట్, వాహనదారులకు శిక్షలా మారుతోంది. చిన్నారుల ఆక్రందనలు: బైకుపై వెళ్లే పసిపిల్లల సున్నితమైన చర్మం ఆ వేడికి కాలిపోతుంటే, వారి ఏడుపు తండ్రి గుండెను పిండేస్తోంది. వృద్ధుల అవస్థలు: శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, ఎండ దెబ్బకు తూలిపోతున్న ముసలి ముతక ప్రజలు.. గ్రీన్ సిగ్నల్ పడగానే "హమ్మయ్య బతికిపోయాం" అని ఊపిరి పీల్చుకుంటున్నారు. రోగుల ఆర్తనాదాలు: హాస్పిటల్ కి వెళ్లే అత్యవసర స్థితిలో ఉన్నవారు, సిగ్నల్ వద్ద ఆ ఒక్క నిమిషం వేడిని భరించలేక విలవిలలాడుతున్నారు. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేంతటి తీవ్రమైన ఈ పరిస్థితిపై 'మన నిజామాబాద్ ఛానల్' తన సామాజిక బాధ్యతగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి...

అక్రమ మొరం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు - కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
నిజామాబాద్,  అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు, రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాపై గట్టి నిఘా కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి జరిపారని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారని గుర్తించి, స్థానిక తహసీల్దార్ సంతోష్ రెడ్డికి సమాచారం అందించగా, ఆర్.ఐ దివ్య అక్కడికి చేరుకుని పంచనామ నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా మొరం తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న మూడు టిప్పర్లు, రెండు జెసిబీలు, ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసి నందిపేట్ ఎస్ హెచ్ ఓ శ్యాంరాజ్ కు అప్పగించడం జరిగిందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

కోటగల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘన విజయం – వందలాది మందికి పరీక్షలు

Image
నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రాంతంలో ఉన్న పద్మశాలి సంఘం తర్ప నెం.3 ప్రాంగణంలో ఆర్‌పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డా. బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం (08-03-2026) ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది కాలనీ వాసులు పాల్గొని తమ కంటి సమస్యలకు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. ఆర్‌పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వనిత (MBBS, DO (OSM), DNB, ఫాకో సర్జన్) రోగులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సల గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన...

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

Image
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.  NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

Image
మహా పండితులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటకు నిలువు టద్దంగా నిలిచాయి ఓట్ల బేరసారాలు...    మొన్నటి వరకు నీతి నిజాయితీ,ప్రజా సేవ,సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని గప్పాలు కొట్టి..పోలింగ్ సమీస్తున్న వేళ బరితెగించారు.. ప్రజా స్వామ్యాన్ని నిలువునా పాతర వేస్తున్నారు..పైసలు పంచితేనే ఓటర్లు కనికరిస్తారని కాబోలు..ఇండిపెండెంట్లు సైతం పచ్చ నోట్ల పందేరానికి తెర తీశారు.ఇండిపెండెంట్లే ఇట్లా బరితెగిస్తుంటే.. ఇక ప్రధాన పార్టీ అభ్యర్థులైతే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రచార పర్వానికి తెరపడిందో లేదో నోట్ల కట్టలతో ఓటర్ల ముంగిట్లో వాలారు గద్దల్లా..ఓటుకు వెయ్యి నుంచి మొదలుకొని రెండు వేల వరకు పంచి పెట్టారు..నిజామాబాద్ నగరంలో అయితే సందేట్లో సడెమియ్య అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటే ఏ మేరకు ఓట్ల కొనుగోలు వ్యవస్తీకృతము అయ్యిందో అర్థము అవుతోంది.. జనరల్ ఎన్నికలను తలదన్నే స్థాయిలో ఓట్ల కోసం బేరసారాలు జరిగాయి. అన్ని పార్టీలు ఒకే తానులో గుడ్డలే అనే సామెత సరిపోయింది.. అన్ని పార్టీలు అక్రమంగా ఓట్లను కొనుగోలు కోసం బరిలో నిల...

కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే  బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్...

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

Image
  ✍︎... జమాల్పూర్ గణేష్ :- కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ  చక్కర్లు కొడుతోంది.     కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది..   ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డ...