Posts

అంటరానివాడ నుంచి అమెరికా వరకు.. వరంగల్ యువకుడి ప్రేమ, పోరాటం, విజయం

Image
--- అంటరానివాడ to అమెరికా--- వయా వరంగల్. ఎక్కడికి పోతన్నవు ? ఊళ్లెకు పోతన్న. ఇప్పడికీ కూడా దళిత వాడల్లో ఈ మాట తరచుగా వినబడుతూ ఉంటది చెప్పుకోడానికి ఊరు పేరున్నా కూడా ఊర్లో జానెడు జాగ మాత్రం ఉండదు, అలాంటి ఒక అంటరానివాడలో పుట్టి పెరిగిన పిలగాడు సురేష్ అమ్మానాన్న చనిపోయారు,చేతిలో డిగ్రీ మాత్రమే ఉంది ప్రాణంగా ప్రేమించిన వైష్ణవి ఇంట్లో గొడవలు ఏమిలేని అతన్ని పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతావు అనే మాటలు,కానీ ఏ మభ్యపూరిత మాటలు వైష్ణవిని సురేష్ చేయి వదిలిపెట్టేలా చేయలేకపోయాయి, పెళ్లి చేసుకున్నారు, అనేక సమస్యలకు,సవాళ్లకు ఎదురునిలిచారు తన కంటే తన భార్య ఎదుగుదల ముఖ్యమని ఆలోచించిన సురేష్, ఎంతో ధైర్యంచేసి వైష్ణవిని 2023 ఆగస్టులో ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడు. కొన్నాళ్లకి... తను కూడా అమెరికా వెళ్లి, అక్కడే ఒక సూపర్ మార్కెట్‌లో సామాన్యమైన ఉద్యోగం చేస్తూ.. పగలు రాత్రులు కష్టపడి భార్యను చదివించాడు. ఒక భర్తగా తన బాధ్యతను నెరవేరుస్తూనే, వైష్ణవి కన్న కలలకి రెక్కలిచ్చాడు. ఈరోజు ఆ కష్టానికి ఆ ధైర్యానికి ఆ సాహసానికి దక్కిన గౌరవం Christian Brothers University నుండి MBA (Healthcare A...

Information Commission, Nizamabad News, Right to Information, RTI Act, RTI Seminar, Telangana Government, సమాచార హక్కు చట్టం

Image
*సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం* నిజామాబాద్, మే 15 : ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం - 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్ లు హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలల...

Dilip Kumar,Encroachment,Government Lands,Nizamabad Municipal,nizamabad news,Sanitation,మున్సిపల్ జాగాలు,

Image
గురువారం నగరంలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పలు డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. డివిజన్ నంబర్ 41 డివిజన్ నంబర్ 12లో తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా శానిటేషన్ కార్యక్రమాలు తాగునీటి సరఫరాపై పరిశీలన చేశారు. అదేవిధంగా మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. మున్సిపల్ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై సంబంధిత అధికారులపై ఉందని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డీ డీ ఈ...

మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

Image
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్...

నిజామాబాద్‌లో హనీ ట్రాప్ గుట్టురట్టు.. కిలాడి దంపతుల అరెస్టు

Image
హనీ ట్రాప్ సంఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.పురుషుల బలహీనతను అలుసుగా చేసుకుని వలపు వల విసిరి హనీట్రాప్ కు పాల్పడుతున్న మహిళను పోలీసులు వల పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మగ వారిని ముగ్గులోకి దించుతూ.. డబ్బులు ఇవ్వ కుంటే కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రూరల్ పీఎస్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముథ్కేడ్ తాలూ కా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేశ్ గైక్వాడ్, ఉజ్వల గైక్వాడ్ దంపతులు. వీరు రెండు నెలల క్రితం మాధవనగర్ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఉజ్వల గైక్వాడ్ కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్ రోడ్డు ప్రాంతంలో రోడ్డు పక్కన నిల బడి ఒంటరిగా వెళ్తున్న మగవారికి సైగలు చేసే ది. ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చిన మగ వారిని తాను వ్యభిచారం చేస్తానని డబ్బులు ఒంటరిగా ఉన్న మగవారిని ముగ్గులోకి దించుతూ అక్రమ వసూళ్లు చేసి మాట్లాడుకొని అతని బైక్ పై కూర్చుని నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకువెళ్లేది. అప్పటికే వీరు వెళ్తున్న బైక్ను వెనకాల నుంచి ఆమె భర్త మంగేశ్ గైక్వాడ్ ఫాలో చేసేవాడు. ...

ట్రాన్స్ జెండర్ల బహిష్కరణ.. ఇందూరు గడ్డపై VDCల ఆగడాలు

Image
నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్​జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్​జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్​లో హిజ్రాలను గ్రామపంచాయతీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలంలో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్​జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారి జీవితం, వారి వ్యాపార లావాదేవాలు సుభిక్షంగా ఉండాలని తాము నిండు మనసుతో ఆశీర్వదిస్తామే తప్ప తమలో ఎలాంటి కల్మషం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయ...

మాక్లూర్ IKP కేంద్రంలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా వడ్లు కొనని అధికారులు

Image
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస అంతా ఇంతా కాదు.. పండిన ప్రతీ గింజను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల డొల్లతనం బయట పడింది..20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు IKP కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఈ దుస్థిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.. వివరాల్లోకి వెళితే... మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారయింది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాల్సిన అధికారులు బాధ్యత మరిచి సంబంధిత మాక్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం తో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గంగారాం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా IKP సిబ్బంది సతాయిస్తున్నారు. ఇక చైర్మన్ సంగతి సరే ఆయన ఎప్పుడు వస్తాడు ..ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస...

51 కులాల పేర్ల మార్పుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం.. పర్యాయ పదాల చేర్పు

Image
కుల పేరు మార్పు.... పర్యాయ పదం చేర్పు... కులం.. స్థాయికి మరో రూపం. దేశ రాష్ట్ర స్థాయిలో కొన్ని కులాల పేర్లు వాటి తోకలు ప్రతిష్టాకరంగా ఉంటాయన్న భ్రమలో సమాజం ఉంట్టుంది. దానికి తగ్గట్టే వారికీ హోదా కూడా లభిస్తుంది, కానీ కొన్ని సంచార, అర్ధ సంచార, విముక్త జాతులు కుల పదాలు అభ్యన్తరకరముగా అనిపిస్తాయి. ఈమేరకు ఆయా కుల సంఘాలు తమ పేరును మార్చాలని సంవత్సరాల తరబడి విజ్ఞప్తులు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం BC కమిషన్ ని ఏర్పాటు చేస్తూ నియమావళి రూపొందించి ఆయా కులాల పేర్లు మార్పుల చేర్పుల పై మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీంతో కమిషన్ సూక్ష్మ స్థాయిలో పర్యటనలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. తుదకు కమిషన్ సిఫారసుల మేరకు 51 కులాల పేర్లు మారుస్తూ పర్యాయ పదాలు చేర్చి మంత్రి మండలి ఆమోదం పొందింది. BC - A లో 49 BC - E లో 2 కులాలకు DNT చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. * BC - A లో నెంబరు 4 గా ఉన్న బుడబుక్కల కులానికి శివ క్షత్రియ పేరును ప్రాయ పదంగా మార్చింది. * BC - A లో నెంబరు 5 క్రింద ఉన్న వన్నారు పదాన్ని తొలగించి దోబీ పేరుగా మార్చింది . దీని కింద చాకలి,...

హీరో విజయ్ కిరూట్ క్లియర్. తమిళనాడులో సంబరాలు

Image
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఐ ఎం,వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా టీవీకేకు మద్దతు తెలపడం విజయ్ బలాన్ని పెంచింది. తమిళనాడు అసెంబ్లీ లో మెజారిటీ మార్కు ను అందుకోవడానికి ఈ మద్దతు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ,ఈ రాజకీ య చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశ్యం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో, తమిళనాడు ప్రజల సం...