51 కులాల పేర్ల మార్పుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం.. పర్యాయ పదాల చేర్పు

కుల పేరు మార్పు.... పర్యాయ పదం చేర్పు...
కులం.. స్థాయికి మరో రూపం. దేశ రాష్ట్ర స్థాయిలో కొన్ని కులాల పేర్లు వాటి తోకలు ప్రతిష్టాకరంగా ఉంటాయన్న భ్రమలో సమాజం ఉంట్టుంది. దానికి తగ్గట్టే వారికీ హోదా కూడా లభిస్తుంది, కానీ కొన్ని సంచార, అర్ధ సంచార, విముక్త జాతులు కుల పదాలు అభ్యన్తరకరముగా అనిపిస్తాయి. ఈమేరకు ఆయా కుల సంఘాలు తమ పేరును మార్చాలని సంవత్సరాల తరబడి విజ్ఞప్తులు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం BC కమిషన్ ని ఏర్పాటు చేస్తూ నియమావళి రూపొందించి ఆయా కులాల పేర్లు మార్పుల చేర్పుల పై మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీంతో కమిషన్ సూక్ష్మ స్థాయిలో పర్యటనలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. తుదకు కమిషన్ సిఫారసుల మేరకు 51 కులాల పేర్లు మారుస్తూ పర్యాయ పదాలు చేర్చి మంత్రి మండలి ఆమోదం పొందింది. BC - A లో 49 BC - E లో 2 కులాలకు DNT చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
* BC - A లో నెంబరు 4 గా ఉన్న బుడబుక్కల కులానికి శివ క్షత్రియ పేరును ప్రాయ పదంగా మార్చింది.
* BC - A లో నెంబరు 5 క్రింద ఉన్న వన్నారు పదాన్ని తొలగించి దోబీ పేరుగా మార్చింది . దీని కింద చాకలి, రజక , దోబీ పేర్లు వస్తాయి.
* BC - A లో నెంబరు 23 క్రింద ఉన్న వీరముష్టి, నెట్టికోడళ్ళను వీరభద్రీయ పేరును పర్యాయ పదంగా పేర్కొంది.
* BC - D లో నెంబరు 5 క్రింద ఉన్న మేర, చిప్పోళ్ళ కులాలకు పర్యాయ పదంగా మేరు ను చేర్చింది.
* BC - D లో నెంబరు 29 క్రింద ఉన్న శూద్ర కులం స్థానం లో తమ్మాలి గా బ్రహ్మమనేతర గా మారింది.
* దొమ్మర కులం స్థానంలో గడ వంశీయ, పిచ్చకుంట్ల పదానికి వంశరాజ్ గా మారింది.
ఈ ధ్రువ పత్రాలు ఆర్. డి. ఓల ఆధ్వర్యంలో జారీ చెయ్యాలని సూచించింది.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్