అంటరానివాడ నుంచి అమెరికా వరకు.. వరంగల్ యువకుడి ప్రేమ, పోరాటం, విజయం
--- అంటరానివాడ to అమెరికా---
వయా వరంగల్.
ఎక్కడికి పోతన్నవు ?
ఊళ్లెకు పోతన్న.
ఇప్పడికీ కూడా దళిత వాడల్లో ఈ మాట తరచుగా వినబడుతూ ఉంటది
చెప్పుకోడానికి ఊరు పేరున్నా కూడా ఊర్లో జానెడు జాగ మాత్రం ఉండదు,
అలాంటి ఒక అంటరానివాడలో పుట్టి పెరిగిన పిలగాడు సురేష్
అమ్మానాన్న చనిపోయారు,చేతిలో డిగ్రీ మాత్రమే ఉంది
ప్రాణంగా ప్రేమించిన వైష్ణవి ఇంట్లో గొడవలు
ఏమిలేని అతన్ని పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతావు అనే మాటలు,కానీ
ఏ మభ్యపూరిత మాటలు వైష్ణవిని సురేష్ చేయి వదిలిపెట్టేలా చేయలేకపోయాయి,
పెళ్లి చేసుకున్నారు,
అనేక సమస్యలకు,సవాళ్లకు ఎదురునిలిచారు
తన కంటే తన భార్య ఎదుగుదల ముఖ్యమని ఆలోచించిన సురేష్,
ఎంతో ధైర్యంచేసి వైష్ణవిని 2023 ఆగస్టులో ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడు.
కొన్నాళ్లకి...
తను కూడా అమెరికా వెళ్లి, అక్కడే ఒక సూపర్ మార్కెట్‌లో సామాన్యమైన ఉద్యోగం చేస్తూ.. పగలు రాత్రులు కష్టపడి భార్యను చదివించాడు. ఒక భర్తగా తన బాధ్యతను నెరవేరుస్తూనే, వైష్ణవి కన్న కలలకి రెక్కలిచ్చాడు.
ఈరోజు ఆ కష్టానికి ఆ ధైర్యానికి ఆ సాహసానికి దక్కిన గౌరవం Christian Brothers University నుండి MBA (Healthcare Administration) లో వైష్ణవి డిగ్రీ పట్టా.. ఇది కేవలం వైష్ణవి విజయం మాత్రమే కాదు,
ఒక ప్రేమికుడి గెలుపు ఇది కదా ప్రేమంటే....
భువనగిరి మండలం, కునూర్ గ్రామం నుండి అమెరికా దాకా సాగిన వీరి ప్రయాణం, ఎంతోమంది ప్రేమికులకు, దంపతులకు ఆదర్శం.
ఒక తోడు
ఒక ధైర్యం
ఒక నమ్మకం సమస్యలకు ఎదురునిలిచే ఒక సాహసం తోడుంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చు అని నిరూపించిన
సురేష్,వైష్ణవిలకు హృదయపూర్వక అభినందనలు. 💐
ప్రేమంటే కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు
ప్రేమించిన వారి కళల్ని అర్థంచేసుకోవడం
వారు ఎంచుకున్న లక్ష్యాలవైపు వారిని ప్రయాణించేలా చేయడం
వారికి తోడుగా నిలబడటం
వారి విజయాన్ని విశ్వవ్యాపితం చేయడం
---- Suresh Kumar
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel