మాక్లూర్ IKP కేంద్రంలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా వడ్లు కొనని అధికారులు
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస అంతా ఇంతా కాదు.. పండిన ప్రతీ గింజను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల డొల్లతనం బయట పడింది..20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు IKP కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది.
ఈ దుస్థిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి..
వివరాల్లోకి వెళితే...
మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారయింది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాల్సిన అధికారులు బాధ్యత మరిచి సంబంధిత మాక్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం తో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.
గంగారాం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా IKP సిబ్బంది సతాయిస్తున్నారు.
ఇక చైర్మన్ సంగతి సరే ఆయన ఎప్పుడు వస్తాడు ..ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస్తున్న ఇప్పటికీ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని సొసైటీ సెక్రటరీ నిర్లక్ష్యం మూలంగానే తమ వడ్లు కొనుగోలు జరగడంలేదని రైతులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఆఫీసులో ఐదారు మంది సిబ్బంది ఉంటే కేవలం ఒకే ఒకరు మాత్రమే ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ వెళ్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో అధికారులు లేకపోవడంతో సొసైటీలోనే ఆకతాయిలు మద్యం ప్రియులు మద్యం సేవించి ప్రాథమిక సహకార సంఘాన్ని ఓ బార్ లా మార్చడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ దృశ్యాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది సొసైటీ నా, లేక లిక్కర్ షాపా అని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. బాధ్యతగల చైర్మన్, సెక్రెటరీ రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూడాల్సిన అవసరం బాధ్యత వారికి ఉన్నప్పటికీ అవేమీ పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel