హీరో విజయ్ కిరూట్ క్లియర్. తమిళనాడులో సంబరాలు
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఐ ఎం,వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా టీవీకేకు మద్దతు తెలపడం విజయ్ బలాన్ని పెంచింది. తమిళనాడు అసెంబ్లీ లో మెజారిటీ మార్కు ను అందుకోవడానికి ఈ మద్దతు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ,ఈ రాజకీ య చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశ్యం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో, తమిళనాడు ప్రజల సంక్షేమం, ప్రగతికి అంకితమైన బీజేపీ, అదే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిందని, అయితే ఎన్నికల ఫలితాలను పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు, తమకు మద్దతు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ ఇప్పటికే గవర్నర్‌ను కోరారు. అయితే, తొలుత సంఖ్యా బలం సరిపోలేదని గవర్నర్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు లేఖలతో విజయ్ బలం 119 కి చేరుకోవడంతో గవర్నర్ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel