కాంగ్రెస్ జెండాకు ఎస్ఐ సెల్యూట్.. డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
కాంగ్రెస్ జెండాకి SI షెల్యూట్ DGP కి BRS ఫిర్యాదు ....... నిజామాబాద్, జూన్ 29; రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ మహేందర్ ఆ కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారి ఒక రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను వారికీ అనుకూలంగా మలచుకొని ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం అయింది అన్నారు.ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై,ఇతరులపై అధికార పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులు పెడుతూ పోలీసులు వ్యవహరిస్తున్న తీ...