ఆబ్కారీలో అంతా అవినీతే..? అక్రమ బదిలీలు, ముడుపుల ఆరోపణలు.. ACB నజర్‌లో నిజామాబాద్ ఆబ్కారీ శాఖ!
నిజామాబాద్ ఆబ్కారీ శాఖను అవినీతి జబ్బు పట్టుకుంది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి అంచావతారులుగా మారారు.ఫలితమే సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కటకటాలు లెక్కపెడుతున్నారు..
జిల్లా వ్యాపితంగా ప్రాణాOతక రసాయనాలు క్లోరోఫామ్,డైజోఫామ్ తదితర రసాయనిక పదార్థాలను కలిపిన కల్తీ కల్లు ఏరులై పారుతోంది..లైసెన్సులు లేని కల్లుదుకాణాలు నడుస్తున్నా చర్యలు లేవు.బెల్టుషాపులు గల్లీ గల్లీల్లో వెలిసాయి. వైన్ షాపులు,బారు షాపుల్లో తెల్లవారు జామున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.. అయినా ఆబ్కారీ శాఖ అధికారులు లంచాలకు మరిగి చర్యలు తీసుకోవడం లేదు..నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మద్యం వ్యాపారానికి కొమ్ముకాయడం ద్వారా ప్రతినెలా కోటి రూపాయలు ముడుపులు అందుతున్నాయని అంచనా ఉంది.. వీటిని పంచుకోవడం లోనూ అవినీతి అధికారులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ప్రతినెలా సమీక్షల పేరిట ఏదో ఒక గెస్ట్ హౌస్ లో జరుపుకునే దావత్ లోనే.. అధికారుల పొజిషన్ లెక్కన కట్టిపెట్టిన నోట్ల ముల్లెలు చేతులు మారుతున్నాయని ఆబ్కారీ శాఖలోనే ప్రచారం జరుగుతోంది.మూటల పంపిణీలో నిజామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అధికారి ఒకరు అన్నీ తానే అయ్యి వ్యవహారం నడుపుతున్నరు.
........... అన్నీ వివాదాలే..
.... ముందెన్నడూ లేనంత వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.. గంజాయి స్మగ్లర్ లను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృత్యువాత పడడం వివాదాస్పదం అయ్యింది..
ప్రొహిబిషన్ పీరియడ్ లో ఉన్న సౌమ్యను అట్లాంటి ఆపరేషన్ లో ముందు వరుసలో ఉంచడం వల్లనే సౌమ్య బలి అయ్యిందని ఉద్యోగులు బాహాటంగానే వ్యతిరేకించారు. SHO స్వప్న కీ వ్యతిరేకంగా కానిస్టేబుల్స్ నిరసన వ్యక్తం చేశారు.. దీనిపై అధికారులు కక్ష కట్టి జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ అందరినీ ఆదిలాబాద్ కీ బదిలీ చేశారు..ఇది కూడా నిబంధనలకీ వ్యతిరేకమే..
ASI పై స్థాయి వాళ్ళకే అంతర్ జిల్లా బదిలీలు ఉంటాయి. జానిస్టేబుల్స్ కు జిల్లాలో మాత్రమే బదిలీలు ఉండడం గమనార్హం. అవినీతి,అక్రమ పాలనా వ్యవహారాలకీ అడ్డులేకుండా ఉండేందుకే అధికారులు ఇష్టారాజ్యం చెలాయించడం నిజామాబాద్ జిల్లాలో మాత్రమే చూడగలరు సాధ్యం అవుతోంది.. ఈ నేపథ్యంలోనే ACB అధికారుల నజర్ పడి ఆబ్కారీ ES జైలు పాలయ్యారు.. ఇంకా ఒకరిద్దరు అధికారులు సైతం ACB తాపానికి గురి అయ్యే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది... ఇప్పటికైనా ఆబ్కారీ అధికారులు తీరు మార్చుకుంటారా..లేక కుక్క తోక వంకర అన్న సామెతను ఫాలో అవుతారో కాలమే తెలుస్తోంది..
మూర్పు: జమాల్ పూర్ గణేష్, రాజేంద్ర బాబు
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel