సౌమ్య కేసులో సంచలన ట్విస్ట్..! గంజాయి స్మగ్లర్లను తప్పించారనే ఆరోపణలు.. లీకైన వీడియోలో కొత్త విషయాలు

( జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు) ... గంజాయి స్మగ్లింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నంలో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందిన సంఘటనకు సంబంధించిన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే వీడియో మన నిజామాబాద్ చేతికి చిక్కింది.. జనవరిలో నిజామాబాద్ సమీపంలోని మాధవనగరం ప్రధాన రహదారి మీద గంజాయి స్మగ్లర్ లను పట్టుకునే ప్రయత్నంలో సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. స్పాట్లో స్మగ్లర్లు ఉపయోగించిన కారు గుద్దిన సంఘటనలో ఆమె మృతి చెందింది.. ఆరు నెలల కిందట జరిగిన ఈ సంఘటనలో అసలు దోషులను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.. నిర్మల్,నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు ఆ రోజు స్పాట్ లో ఉన్నా.. కొందరిని ఆబ్కారీ అధికారులు తప్పించారని ఇద్దరు నిందితులు ఆక్రోశం వెళ్లగక్కిన వీడియో సౌమ్య కేసు వెనుక దాగివున్న డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఆబ్కారీ SHO స్వప్న ఆఫీసు బ్యారక్ లో నిందితులు అధికారులతో వాదనకు దిగిన సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు నిజామాబాద్ నిందితులను సౌమ్య కేసునుంచి తప్పించిన తీరును తేటతెల్లం చేస్తోంది.. నిందితుల్లో ఒకరు గాజు సీసాను పగులగొట్టి కొడుపును చీల్చుకునే ప్రయత్నం వల్ల నిందితులను ఉంచే బ్యారకు నిర్వాహకుల బాధ్యత రాహిత్యం బయట పడింది. బ్యారకు లో నిందితులు ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకోకుండా వాటికి ఉపయోగించే గాజు వస్తువులు,తాళ్ళు వంటివి ఉండకుండా చూడాల్సిన బాధ్యత SHO మేడం దే.. ఆమె నిర్లక్ష్యం వల్ల స్టేషన్లో కస్టోడియన్ డెత్ ప్రయత్నం జరిగింది.. అయినా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేరు ఉన్నతాధికారులు.. అసలైతే ఈ సంఘటన మీద SHO పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని.. కానీ అలా జరుగలేదంటే సదరు మేడం పవర్ ఏందో చెప్పకనే చెబుతోంది.. ఇంకో విచిత్రం ఏమిటంటే.. సౌమ్య మృతి సంఘటనతో వెలుగులోకి వచ్చిన స్మగ్లర్లను కేసులో నుంచి తప్పించారని కస్టడీలో ఉన్న అనుమానితులు పేర్లను వెల్లడించినా ఆ కోణంలో విచారణ జరుగక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. సహచర ఉద్యోగి ప్రాణాన్ని తీసిన కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరిగినట్లు కస్టడీలో అనుమానితులు మాట్లాడిన వీడియో పట్ల అయినా స్పందిస్తారో లేదో తేలాల్సి ఉంది...
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్