కాంగ్రెస్ జెండాకు ఎస్‌ఐ సెల్యూట్.. డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ జెండాకి SI షెల్యూట్ DGP కి BRS ఫిర్యాదు ....... నిజామాబాద్, జూన్ 29; రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఐ మహేందర్ ఆ కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారి ఒక రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను వారికీ అనుకూలంగా మలచుకొని ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం అయింది అన్నారు.ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై,ఇతరులపై అధికార పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులు పెడుతూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే విధంగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని,పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనేందుకు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో జరిగిన ఘటన నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే విచారణ జరిపించి,ఎస్ ఐ మహేందర్ పై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్