మైనార్టీ మహిళలకు అండగా ఉంటాం.. నిజామాబాద్‌లో 500 మందికి కుట్టు మిషన్ల పంపిణీ: షబ్బీర్ అలీ

మైనార్టీ మహిళలకు అండగా ఉంటాం.. -- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ నిజామాబాద్, జూన్30; నిజామాబాద్ పట్టణంలోని న్యాక్ సెంటర్‌లో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలిచి, గౌరవప్రదమైన జీవనం సాగించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో రూ.1.02 కోట్ల వ్యయంతో మొత్తం 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని, అందులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమని తెలిపారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని రంగాల్లో మైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న పరిశ్రమలుగా అభివృద్ధి చెందాలని, మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా చైర్మన్ కేశ వేణు, రత్నాకర్ , జావిద్ అక్రమ్ , MA పహీం , నయీమ్, కరీం, పాప ఖాన్, హఫీస్ లయీక్ ఖాన్ , హరూన్ ఖాన్ పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్