Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన

బీజేపీ శాసనసభ పక్ష సమావేశనికి కామారెడ్డి వేదిక అయ్యింది. రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం కామారెడ్డి ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో నిర్వహించారు.ఈ కీలక భేటీలో.. ఎమ్మెల్సీ సీ.అంజిరెడ్డి,బిజెపి శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , శాసనసభాపక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఆరోపించింది.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పక్షం అసెంబ్లీలో గొంతు విప్పుతుందని సమావేశం ప్రకటించింది. దీని కోసం మార్చి 7 తేదీన బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి పర్యటన ప్రారంభిస్తామని బీజేపీ పక్ష నేత యేలేటి మహేశ్వర రెడ్డి ప్రకటించారు.అన్ని జిల్లాల్లో పర్యటించిన తరువాత అసెంబ్లీ సమావేశాలలో అవలంభించ వలసిన వ్యూహాన్ని ఎంచుకుంటామని చెప్పారు. రీటైడ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించ లేని సర్కార్ నిర్వాకం వల్ల ఆత్మహత్యలు జరిగాయని బీజేపీ శాసన సభ పక్ష సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది..

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..