హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

తెలంగాణ రాజకీయాల్లో బలమైన క్రేజీ లీడర్లు ఇద్దరు భేటీ కావడం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది..
నిజామాబాద్ లో RTO గా పని చేసిన కోమటిరెడ్డి మోహన్రెడ్డి మనుమరాలి వివాహ కార్యక్రమం దీనికి వేదిక అయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతూ, దక్షిణ తెలంగాణలో బలమైన నేతగా ఎదిగిన మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BRS ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
ఫంక్షన్ లో ఈ ఇద్దరు నేతలు సిరియస్గా చర్చించుకుంటున్న వీడియో షోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రాజగోపాల్ రెడ్డి సీరియస్ ప్రజెంటేషన్ ఇస్తుంటే..అంతే సీరియస్ గా వింటూ హరీష్ రావు ఏమి చేద్దాం అంటూ నెత్తి కొట్టుకుంటున్న వీడియో పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి..లేకుంటే ముఖ్యమంత్రి సీటే టార్గెట్ అంటూ ఇటీవలి కాలంలో బహిరంగంగా ధమ్కీ ఇచ్చారు రాజ గోపాల్ రెడ్డి..
వీళ్ళు మాట తప్పితే మునుగోడును మీరు చూసుకోండి..తెలంగాణలో జెండా పాతే పనిలో నేనుంటా నంటూ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో కూడా వీరిద్దరి మంతనాలకు ప్రాధాన్యత ఏర్పడింది..


Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్