రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు
66 కోట్ల బియ్యం మాయం -MP అర్వింద్ దోస్త్ శ్రావణ్ పై కేసుప్రభుత్వాన్ని మోసం చేసిన నిజామాబాద్ ప్రముఖ వ్యాపారి గుట్టు వెలుగులోకి వచ్చింది. 66 కోట్ల విలువైన 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి దోచేసిన సదరు వ్యాపారి కాపర్తి శ్రావణ్ పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సన్నిహితుడు కాపర్తి శ్రవణ్. నిజామాబాద్ జిల్లాలో కాలూరు గ్రామంలోని శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం మిల్లు గోడౌన్ల నుంచి 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది. జులై 22న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన తనిఖీల్లో రూ. 66.12 కోట్ల విలువైన ధాన్యాన్ని కాపర్తి శ్రవణ్ స్వాహా చేసినట్లు నిర్ధారణ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్కసీజన్ లోనే 66 కోట్లకు టోకరా వేసిన శ్రావణ్ రైస్ మిల్లు లావాదేవీల కూపీ లాగుతున్నారు అధికారులు. నాలుగైదు ఏళ్లుగా శ్రావణ్ మిల్లింగ్ బియ్యాన్ని పక్క దారి పట్టించిన అంశంపై లోతైన విచారణ జరుగుతుంది. రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఈ మిల్లుకు అప్పచెప్పింది. మిల్లింగ్ చేసిన 66 కోట్ల విలువైన బియ్యాన్ని కాపర్తి శ్రావణ్ దారి మళ్లించారు.. కాపర్తి శ్రవణ్ నుంచి రూ. 66 కోట్ల ప్రజల సొమ్మును వడ్డీ, పెనాల్టీలతో సహా వసూలు చేస్తారా? లేదా నాయకుల ఒత్తిళ్లతో కేసు క్లోజ్ చేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel