Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

నిజామాబాద్ వాసులే డీఎస్ వారసులు పీస్ ర్యాలీలో ధర్మపురి సంజయ్

( ప్రీతం రెడ్డి) నిజామాబాద్; కులాలు, మతాలు అంటూ రెచ్చగొడుతూ కొందరు రాజకీయ లబ్ధి కోసం వారి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పీస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ లో ఉండే ప్రజలు అందరూ తన తండ్రి డి శ్రీనివాస్ వారసులేనని, వారు తమకు జన్మనిచ్చినా... ప్రతి ఒక్కరి హృదయాల్లో వారు చిరస్థాయిలో ఉండిపోతారన్నారు. నిజామాబాద్ అంటేనే మినీ భారతదేశం అని అలాంటి ఈ జిల్లాలో కొందరు రాజకీయ పార్టీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతూ కులాలు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. తన తండ్రి హయాంలో అన్ని కులాలు, మతాలను దగ్గరికి తీసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించే దిశగా కృషి చేసేవారని ఆయన అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయాలకు ప్రయోజనాల కోసం హిందూ ముస్లింలు సోదరులుగా పిలుచుకునే అప్పటి సంస్కృతిని ఇప్పుడు ఉన్న ఓ రాజకీయ పార్టీ నాయకులు రెచ్చగొడుతూ అల్లర్లకు ప్రోత్సహిస్తున్నారని ఇకనైనా వారి పద్ధతి మానుకోవాలన్నారు. నిజామాబాద్ అంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మినీ భారతదేశం గా తెలుసుకోబడే విధంగా . అందుకే నేను ఈ అన్ని కులాలు మతాలు కుల సంఘాలతో కలిసి ఫీస్ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించడం జరిగిందన్నారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన