Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

చెవి ఆపరేషన్ తరువాత పేషేంట్ మృతి..

చెవిలో చీము కారుతుందని ఆసుపత్రికి వస్తే యువకుడి ప్రాణం పోయింది. ఆసుపత్రి వైద్యుని నిర్వాకం వల్లే యువకుడు చనిపోయాడు బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో తో ఆందోళన చేపట్టారు. భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (23) మంగళవారం ఉదయం 10 గంటలకు చెవిలో చీము కారడంతో జిల్లా కేంద్రంలోని ద్వారకా హాస్పిటల్లో చేరారు. అతనిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అజయ్ కి శస్త్ర చికిత్స చేశారు. కానీ సర్జరీ జరిగిన తరువాత పెషేంట్ కు మెలుకువ రాలేదు. దీంతో డాక్టర్ హుటాహుటిన పేషెంట్ అజయ్ ని సమీపంలో ఉన్న హోప్ ఆస్పత్రికి తరలించారు.. అజయ్ ని పరీక్షించిన హోప్ ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.ఒక్కసారిగా షాక్ గురైన కుటుంబ సభ్యుల రోధనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు ద్వారక ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలంటూ మృతదేహంతో బైఠాయించారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన