Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

🌾 నిజాంబాద్‌లో పసుపు రైతుల ఆందోళన 🔥 ఈ-నామ్ పని చేయక మార్కెట్‌లో ఉద్రిక్తత!

పసుపు రైతులు ఆందోళన.. నిజాంబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర రాకపోవడం అలాగే ఈ నామ్ మార్కెట్ ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరి నిరసన తెలియజేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ ను గెరావ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిజాంబాద్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు నిలిచిపోయాయి ఈనాం ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో మార్కెట్ మొత్తం పసుపుతో నిండిపోయింది ఒకవైపు ధరలు లేక మరోవైపు ఆన్లైన్ విధానం పనిచేయక పసుపు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన