Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

దేశంలో తొలి సారి మావోయిస్టు మాజీ నేతలతో సీఎం చర్చలు

మావోయిస్టు మాజీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన రాజకీయ చర్చలు సక్సెస్ అయినట్లు సమాచారం. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వం మావోయిస్టు పార్టీలో టాప్ లీడర్లుగా పనిచేసి లొంగిపోయిన అగ్ర నాయకులతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. సరికొత్త చర్చకు దారి తీసింది. దేశంలో మొదటిసారి మావోయిస్టు మాజీలతో అధికారిక భేటీగా సరికొత్త రికార్డు సృష్టించినది. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో హోంశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో మొవోయిస్టు పార్టీ టాప్ లీడర్ దేవీజీ,రాజారెడ్డి,చంద్రన్న,దామోదర్, నర్సింహారెడ్డి,సుజాతక్క సీఎం తో మాట్లాడారు. జైలల్లో ఉన్న మావోయిస్టు ఖైదీలను కలిసే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం ను కోరినట్లు సమాచారం. వారితో కలిసి లొంగుబాట్ల మీద ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేస్తామని మాజీ అగ్ర నేతలు ప్రతిపాదించారు. సరెండర్ పాలసీ అమలులో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.సరెండర్ పాలసీ మీద అసెంబ్లీ లో ప్రకటన చేసి చర్చకు పెడతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కీలకమైన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి,ఎస్ ఐ బి ఐజీ సుమతి పాల్గొన్నారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన