Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయం

ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయ గతంలో సీఎం కేసీఆర్ హిందువులపై అవమానించే విధంగా హిందుగాళ్లు బొందు గాళ్లు అంటే తెలంగాణ ప్రజలు ఆయనను బొంద పెట్టారని ఆయనకు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం ఖాయమని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేను గాంధారి క్రాస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవి దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు. మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే పై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన ,ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయం పై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పడమే కాకుండా తనను రేవంత్ ఉద్దీన్ అని పలకమని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకపై ఇలానే హిందూ దేవతలపై హిందూ ఆలయాలపై, హిందూ ప్రజలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ సర్కార్ కి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన