Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

బీజేపీ ముఖ్య నాయకుడే అడ్డుకున్నారు... మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

మున్నూరు కాపు కులస్థులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ లకు చెందిన మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు.అయితే ఈ సన్మాన కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీనిపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. కానీ కొందరు బిజెపి నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ జెండా మోసిన మునురుకాపులకు తాను తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాలని ఉన్నప్పటికీ కూడా బిజెపి అగ్ర నాయకుల ఆదేశాల మేరకు రాలేకపోయారని ఆయన అన్నారు. వారిని ఆ పార్టీ అడ్డుకున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న మున్నూరు కాపు కులస్తులందరూ మా హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోతారని అందుకే బిజెపి పార్టీ నుండి గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లకు ఖాళీ కుర్చీలలో వారి పేరు రాసిపెట్టి సత్కరించినట్లు ఆయన అన్నారు. ఇకనైనా బిజెపి నాయకులు కులమత విద్వేషాలను మానుకొని అందరూ ఒకటే అనే భావనతో ముందుకు నడవాలని ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలే తప్ప ఎలాంటి రాజకీయాలకు స్వలాభం కోసం తాను చేపట్టే ఈ కార్యక్రమానికి వారు అడ్డుకట్ట వేయడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. కొందరు కులాన్ని మనుషులను విభజించాలని చూస్తున్నారని, కానీ తాము మాత్రం డీఎస్ అడుగుజాడల్లో అందరినీ కలుపుకొని పోవాలనే చూస్తున్నామన్నారు. కొందరి నాయకుల స్వార్థ రాజకీయాలకు అమాయకులు బలవుతున్నారన్నారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన