Posts

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

దేశంలో తొలి సారి మావోయిస్టు మాజీ నేతలతో సీఎం చర్చలు

Image
మావోయిస్టు మాజీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన రాజకీయ చర్చలు సక్సెస్ అయినట్లు సమాచారం. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వం మావోయిస్టు పార్టీలో టాప్ లీడర్లుగా పనిచేసి లొంగిపోయిన అగ్ర నాయకులతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. సరికొత్త చర్చకు దారి తీసింది. దేశంలో మొదటిసారి మావోయిస్టు మాజీలతో అధికారిక భేటీగా సరికొత్త రికార్డు సృష్టించినది. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో హోంశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో మొవోయిస్టు పార్టీ టాప్ లీడర్ దేవీజీ,రాజారెడ్డి,చంద్రన్న,దామోదర్, నర్సింహారెడ్డి,సుజాతక్క సీఎం తో మాట్లాడారు. జైలల్లో ఉన్న మావోయిస్టు ఖైదీలను కలిసే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం ను కోరినట్లు సమాచారం. వారితో కలిసి లొంగుబాట్ల మీద ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేస్తామని మాజీ అగ్ర నేతలు ప్రతిపాదించారు. సరెండర్ పాలసీ అమలులో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.సరెండర్ పాలసీ మీద అసెంబ్లీ లో ప్రకటన చేసి చర్చకు పెడతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కీలకమైన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీ...

🌾 నిజాంబాద్‌లో పసుపు రైతుల ఆందోళన 🔥 ఈ-నామ్ పని చేయక మార్కెట్‌లో ఉద్రిక్తత!

Image
పసుపు రైతులు ఆందోళన.. నిజాంబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర రాకపోవడం అలాగే ఈ నామ్ మార్కెట్ ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరి నిరసన తెలియజేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ ను గెరావ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిజాంబాద్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు నిలిచిపోయాయి ఈనాం ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో మార్కెట్ మొత్తం పసుపుతో నిండిపోయింది ఒకవైపు ధరలు లేక మరోవైపు ఆన్లైన్ విధానం పనిచేయక పసుపు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

Image
తెలంగాణ రాజకీయాల్లో బలమైన క్రేజీ లీడర్లు ఇద్దరు భేటీ కావడం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.. నిజామాబాద్ లో RTO గా పని చేసిన కోమటిరెడ్డి మోహన్రెడ్డి మనుమరాలి వివాహ కార్యక్రమం దీనికి వేదిక అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతూ, దక్షిణ తెలంగాణలో బలమైన నేతగా ఎదిగిన మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BRS ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఫంక్షన్ లో ఈ ఇద్దరు నేతలు సిరియస్గా చర్చించుకుంటున్న వీడియో షోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజగోపాల్ రెడ్డి సీరియస్ ప్రజెంటేషన్ ఇస్తుంటే..అంతే సీరియస్ గా వింటూ హరీష్ రావు ఏమి చేద్దాం అంటూ నెత్తి కొట్టుకుంటున్న వీడియో పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి..లేకుంటే ముఖ్యమంత్రి సీటే టార్గెట్ అంటూ ఇటీవలి కాలంలో బహిరంగంగా ధమ్కీ ఇచ్చారు రాజ గోపాల్ రెడ్డి.. వీళ్ళు మాట తప్పితే మునుగోడును మీరు చూసుకోండి..తెలంగాణలో జెండా పాతే పనిలో నేనుంటా నంటూ కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన ప...

చెవి ఆపరేషన్ తరువాత పేషేంట్ మృతి..

Image
చెవిలో చీము కారుతుందని ఆసుపత్రికి వస్తే యువకుడి ప్రాణం పోయింది. ఆసుపత్రి వైద్యుని నిర్వాకం వల్లే యువకుడు చనిపోయాడు బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో తో ఆందోళన చేపట్టారు. భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (23) మంగళవారం ఉదయం 10 గంటలకు చెవిలో చీము కారడంతో జిల్లా కేంద్రంలోని ద్వారకా హాస్పిటల్లో చేరారు. అతనిని పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసేందుకు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అజయ్ కి శస్త్ర చికిత్స చేశారు. కానీ సర్జరీ జరిగిన తరువాత పెషేంట్ కు మెలుకువ రాలేదు. దీంతో డాక్టర్ హుటాహుటిన పేషెంట్ అజయ్ ని సమీపంలో ఉన్న హోప్ ఆస్పత్రికి తరలించారు.. అజయ్ ని పరీక్షించిన హోప్ ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.ఒక్కసారిగా షాక్ గురైన కుటుంబ సభ్యుల రోధనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు ద్వారక ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలంటూ మృతదేహంతో బైఠాయించారు.

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ - బద్నాం షబ్బీర్ కు - KVR సేఫ్ సైడ్

Image
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ బద్నాం షబ్బీర్ కు KVR సేఫ్ సైడ్ (జమాల్పూర్ గణేష్ ములుపురు రాజేంద్ర బాబు) కామారెడ్డి కాలేజీ భూముల వివాదంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారు MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.దూకుడు,దుందుడుకు స్వభావిగా ముద్ర పడిన రమణ రెడ్డి చాణక్య నీతితో తాపీగా బాల్ ను కాంగ్రెస్ గ్రౌండ్ లోకే తోసి తమాషా చూస్తున్నారు.. ఇక రమణ రెడ్డి మీద విమర్శలు,ఆరోపణలతో చీటికి మాటికి చికాకు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీనే నిర్దిష్ట,రికార్డుల ప్రాతిపదికన తేల్చాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి నెట్టివేయ బడింది. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డిలో పెద్ద దిక్కుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థి షబ్బీర్ అలీ నోటికి తాళం వేసే వ్యూహంలో భాగంగానే రమణ రెడ్డి అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. తన పైన కాలేజీ భూముల వ్యవహారంలో వస్తున్న విమర్శల నిగ్గు తేల్చాలని కలెక్టర్ను కలిసి లేఖ ఇవ్వడం సంచలనం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కలెక్టరుకు కాలేజీ భూముల్లో  MLA ప్రమేయాన్ని గుర్తించడం,అక్రమాలను గుర్తించడం,దీనిలోనూ రమణ రెడ్డి జోక్యాన్ని నిర్దారించడం అనేది కత్తిమీద సామే. భూములను ఏయే సంస్థలకు ఎన్ని ఎకరాలు కేట...

CSI గ్రౌండ్లో చర్చకు రా.. MLA వెంకట రమణ రెడ్డికి - కాంగ్రెస్ సవాల్

Image
  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీరుపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. 'వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం!'అంటూ మండి పడింది. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు; 1)​రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా: తన విద్యాసంస్థ పక్కన ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టింది నువ్వు కదా?కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా 30 వేల గజాల భూమిని బెదిరించి 3 వేల గజాలకు తగ్గించలేదా? 2 )​కర్షక్ విద్యాసంస్థల కుంభకోణం: రైతుల బిడ్డల కోసం సేకరించిన 260 ఎకరాల భూమిని అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి దారదత్తం చేసి, ఆ భూములను బ్యాంకులో కుదవపెట్టి రూ. 7 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? 3)ఫోర్జరీ సంతకాలపై కోర్టు కేసులు ఉన్నవా లేవా? 4)"మూడు నెలల క్రితం జపాన్ పర్యటన వెనుక అసలు కథ ఏంటి? అక్కడ ఏం చేశావో సెకండ్ ఎపిసోడ్‌లో నీ బండారం బయటపెడతాం" అని హెచ్చరించారు. 5) ​రోడ్డు నిర్మాణం వెనుక కమీషన్లు: టేక్రియల్ నుండి లింగాపూర్ 100 ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే కాకముందు అడ్డుకున్న వ్యక్తివి, ఇప్పుడు ముందుండి ఎందుకు వేయిస్తున్నావు? అందులో నీకు ఎంత ముట్టింది? 6)​వరుస మోసాలు - బెదిరింపులు ​ఎమ్మెల్...

వంటపనిలోనూ తగ్గేదేలే.. -- కులాంతర ప్రేమ పెళ్లి -- మేయర్ ఉమ తండ్రి ప్రముఖ జర్నలిస్టు

Image
  (జమాల్పూర్ గణేష్, ప్రీతం రెడ్డి) ఆమె నగర ప్రథమ పౌరురాలు.తెలంగాణలోనే అతిపెద్ద మూడవ  మునిపల్ కొర్పొరేషన్ మేయర్గా ప్రమాణం చేశారు.ఆరోజు అంతా బిజీ బిజీగా గడిపారు.నిజామాబాద్ లో బుటిక్ నడుపుకునే అతి సాధారణ సగటు మహిళ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఊహించని ప్రోటోకాల్ పోస్టు సొంతమైంది కూడగాయల ఉమారాణికి..దీనితో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితర ఉద్దండులతో మర్యాద పూర్వక భేటీలు..కాంగ్రెస్ శ్రేణులతో సంబరాల్లో గడిచి పోయింది.మరుసటిరోజు యధావిధిగా ఇంటి పనులు,వంట పనుల్లో నిమగ్నం అయ్యారు నగర ప్రధమ పౌరురాలు..అదే సమయానికి మన నిజామాబాద్ వీడియో జార్నలిస్టు పొద్దుటూరు ప్రీతం రెడ్డి మేయర్ ఇంటి పనుల్లో బిజీ అయిన తీరును చిత్రీకరించారు..   గ్యాస్ స్టవ్ వెలిగించి పప్పుచారు కాస్తూనే.. మరో సైడ్ చాయ్ చేశారు..నడుమ కిచెన్ సర్దడం.పోపు డబ్బాలు,మసాలా దినుసులు క్రమంగా సర్దుకుని ఇల్లాలుగా భాద్యతలు పూర్తి చేసుకున్నరూ. మేయర్ కిచెన్ నుంచి హాల్ లో కొద్ది సేపు టీవీ చూసారు.ఆతరువాత భర్త కరాటే రమేష్ తో కలిసి బంధు మిత్రులతో కలిశారు మేయర్ ఉమారాణి. స్నేహితులు,హితులు వారిద...

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

Image
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.  NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

Image
జమాల్పూర్ గణేష్...✍️  ఎంపీ అర్వింద్ ఏది మాట్లాడినా ట్రిండింగే..మౌనంగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులకు తొండను మింగిన అనుమానమే అంటే అతిశయోక్తి కాదేమో... మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు హిందూత్వ ఎజెండాను గల్లీ గల్లీల్లో విస్తృతంగా ప్రచారం చేసి సింగిల్ హ్యాండ్ తో 28 సీట్లను సంపాదించిన అర్వింద్ నడవడిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..  నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల మరుసటిరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ఎదురు చూశాయి అనేక వర్గాలు.. ఈ అంచనకు భిన్నంగా గంభీరంగా, రెండు మూడు అంశాలకే పరిమితము అయ్యారు.28 సీట్లు తక్కువేమీ కాదంటూనే ప్రతిపక్షంలో కూర్చుంటామని సాదా సీదాగా చెప్పి ,మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై ప్రస్తావనకే పరిమితం అవ్వడంపై కూడా చర్చ సాగుతోంది. సహజమైన నైజానికి భిన్నంగా అర్వింద్ కూల్ గా ,గుంభనంగా, శాంతంగా కనబడడం కూడా ప్రత్యర్థి పార్టీల్లో చర్చకు తావిచ్చినట్లు స్పష్టమైతోంది.ఇది ఎంతదాక పోయిందంటే ఆయనతో తిరిగే కమలం ముఖ్య కార్యకర్తలు సైతం సోమవారంనాడు మేయర్ ఎన్నికలో ఏమి జారుగుతాదో చూడండి అనేదాక పోయింది అర్వింద్ ...