Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

నిజామాబాద్ జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం - క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి.

నిజామాబాద్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైక్వాండో క్రీడ పోటీలో పాల్గొంటున్న విద్యార్థులు క్రీడాకారులు తమ నైపుణ్యం ప్రదర్శించి జిల్లాకు వన్నె తీసుకురావాలని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల. ఉమాదేవి అన్నారు. ఈరోజు నగరంలోని టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ పవర్, టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వహజ్ అలీ ఖాన్, రాష్ట్ర అబ్జర్వర్ ముస్తఫా, లు హాజరైనారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. నగరంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ రమేష్ పవర్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే శిక్షణ తీసుకుంటే శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకుంటే క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ రమేష్ పవర్ మాట్లాడుతూ జిల్లాలో తైక్వాండో అభివృద్ధి కోసం మరిన్ని శిక్షణ శిబిరాలు, ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడమే తైక్వాండో ప్రధాన లక్ష్యమని, జిల్లా స్థాయిలో నిరంతరం పోటీలు నిర్వహిస్తూ ప్రతిభను వెలికితీస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు అనుభవజ్ఞులైన కోచ్‌లను అందుబాటులో ఉంచుతున్నామని, తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మీర్ వాహజాద్ అలీ మాట్లాడుతూ తైక్వాండో క్రీడ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, జిల్లా స్థాయి పోటీలు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడానికి మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. క్రమశిక్షణ, కఠిన సాధనతో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముగింపు సమావేశంలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, జిల్లా టైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వాగ్మారే సుభాష్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్ష కార్యదర్శు శేఖర్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ జర్నలిస్ట్ క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన