Posts

Showing posts with the label Mana Nizamabad

ఆటో కార్మికుల సమస్యలపై గణేష్ బిగాల భారీ ర్యాలీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Image
ప్రజా వంచన పాలనఇది -బిగాల గణేష్ ఆగ్రహం నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో గణేష్ బిగాల ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిర్ణయాల వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిని, వారి పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం లేక నిత్యం తిండికి కూడా ఇబ్బందులు పడుతూ, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో సోదరులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నగరంలో పారిశుధ్య లో...

22A భూముల జాబితాతో ప్రజలు ఇబ్బందుల్లో.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై గణేష్ బిగాల విమర్శలు

Image
. "నిషేధిత" కుట్రతో భూములను మింగాలని స్కెచ్ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం గణేష్ బిగాల నిర్వహించారు. 22A నిషేధిత జాబితాతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని గణేష్ బిగాల మండిపడ్డారు. - ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. - 22A జాబితాలో భూములు చేరడంతో వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వంటి లావాదేవీలు నిలిచిపోతున్నాయని తెలిపారు. - 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు వంటి రక్షించాల్సిన భూములను నిషేధిత జాబితాలో ఉంచే ఉద్దేశం ఉందని, అయితే ప్రైవేట్ వ్యక్తుల...

ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

Image
*ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో ...

లోపల దోస్తీ.. బయట కుస్తీ.. కాంగ్రెస్, బీజేపీ బంధంపై ఇందూర్‌లో చర్చ

Image
లోపల దోస్తీ-బయట కుస్తీ కాంగ్రెస్,బీజేపీ బంధం ...... (జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్రబాబు) బీజేపీ,కాంగ్రెస్ ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది ..దీనికి ఇందూర్ వేదిక అయ్యింది.. ప్రభుత్వంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రెండు రోజుల కార్యక్రమాల్లో బీజేపీ MLA లు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త,రాకేష్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజు ఆర్ముర్ MLA రాకేష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి నిజామాబాద్ లో నిర్మించిన పైడి కన్వెన్షన్ ను పొంగులేటి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.. అదేరోజు రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకపూర్ వెళ్లిన మంత్రి MLA ఆథిత్యాన్ని స్వీకరించారు. అదే ఊరిలో ఆర్ముర్ అసెంబ్లీ ఇంచార్జి, రాకేష్ రెడ్డితో రాజకీయ పోరు చేస్తున్న వినయ్ రెడ్డి లేకుండానే డబుల్ బెడ్ రూమ్స్ ను పరిశీలించారు మంత్రి పొంగులేటి.. శనివారం ఉదయం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశంలో అర్బన్ MLA గుప్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తారు.. అర్బన్ లో 1O ఏళ్లలో ఒక్కఇల్లు ఇవ్వలేదని BRS పై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకా...

మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్

Image
**మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం** **పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు** ఆగస్టు 7 మండల్ డే ను పురస్కరించుకొని నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ విగ్రహ ప్రతిపాదిత స్థలం (బీజేఆర్ చౌరస్తా )లో బిపి మండల్ చిత్రపటానికి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసిన అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య(SDF)చైర్మన్ శ్రీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం 1990 ఆగష్టు 7 న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలు నోచుకోకపోవడం ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలోని పాలకవర్గ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి ఓబీసీల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు. ఒకవైపు సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటాకావాలంటూ ప్రజలు పోరాడుతుంటే కనీసం ఉన్న హక్కులను కూడా కాలరాసే విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి దోచిపెడుతూ నిజమైన భూమిపుత్రులైన సకల సంపదల సృష్టికర్తలైన ఓబీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మరోవైపు రిజర్వేషన్ హటావో పేరుతో ఇప్పటిక...

ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభలు విజయవంతం చేయండి.. పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ

Image
  6న గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయండి..  పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ.. సిద్దిపేట, ఆగస్టు 3. ఈనెల 6 న సిద్దిపేటలో, హైదరాబాద్ లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వర్ధంతి సభ పోస్టర్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమం లో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో చైర్మన్ ఆస లక్ష్మణ్,TPTF రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, ప్రజాగాయకులు భీమసేన, చికోటి నర్సింలు, అవని పత్రిక సంపాదకులు కూతురు రాజిరెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి సిద్దెంకి యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య,BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కంకిటి నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య, BRS నాయకులు గుండు శ్రీనివాస్, తెలిజీరు శ్రీనివాస్ యాదవ్, గడీల రమేష్ రెడ్డి, చిటుకుల మైసా రెడ్డి తదితరులు కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ ...

అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా.. ఎంబీబీఎస్ ఫీజులన్నీ నేనే భరిస్తా అని హామీ

Image
• అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా .................. • నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో హరీష్ రావును ఆశ్రయించిన అఖిల. • 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే దాకా మెరీడియన్ విద్యాసంస్థల్లో చదివించిన మాజీమంత్రి . • ఇటీవల డాక్టర్ చదువు కోసం నీట్ పరీక్ష రాసిన అఖిల. • తన ఇంటికి ఆత్మీయంగా ఆహ్వానించడమేగాక అన్నం పెట్టి ఆత్మీయ భరోసా అందించిన మాజీ మంత్రి. • ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా తానే ఫీజు కట్టి చదివిస్తానని మనోధైర్యం కల్పించిన హరీష్ రావు గారు. • తండ్రి ని కోల్పోయి ఆర్థిక స్థోమత లేక ఆందోళన లో ఉన్న నిరుపేద బిడ్డకు అండగా హరీష్ రావు గారు • పేద విద్యార్థులకు పెద్దదిక్కుగా నిలిచి మరో సారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు. " హరీష్ రావు గారు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో అదుకొనే అపద్భాందవుడు... అన్న ల ఆత్మీయత నీచ్చే నాయకుడు.. అభివృద్ధి కి నిలువుటద్దం ఆయన.. కష్టం వచ్చింది అంటే నేను ఉన్న అని భరోసా నిచ్చే నేత... సిద్దిపేట కుటుంబ సభ్యుడిగ నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే ప్రజా నాయకులు ఇలా హరీష్ రావు గారి గురించి ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్న సరిపోనంత అభిమానం చాటుక...

ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రులు.. వరద ప్రవాహం, నీటి నిల్వలపై సమీక్ష

Image
నిజామాబాద్, ఆగస్టు 01 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని (ఇన్ ఫ్లో) పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికిప్పుడు వర్షాలు నిలిచిపోయినా, మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుందని అన్నారు. ఈ సంద...

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

Image
66 కోట్ల బియ్యం మాయం -MP అర్వింద్ దోస్త్ శ్రావణ్ పై కేసు ప్రభుత్వాన్ని మోసం చేసిన నిజామాబాద్ ప్రముఖ వ్యాపారి గుట్టు వెలుగులోకి వచ్చింది. 66 కోట్ల విలువైన 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి దోచేసిన సదరు వ్యాపారి కాపర్తి శ్రావణ్ పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సన్నిహితుడు కాపర్తి శ్రవణ్. నిజామాబాద్ జిల్లాలో కాలూరు గ్రామంలోని శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం మిల్లు గోడౌన్ల నుంచి 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది. జులై 22న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జరిపిన తనిఖీల్లో రూ. 66.12 కోట్ల విలువైన ధాన్యాన్ని కాపర్తి శ్రవణ్ స్వాహా చేసినట్లు నిర్ధారణ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్కసీజన్ లోనే 66 కోట్లకు టోకరా వేసిన శ్రావణ్ రైస్ మిల్లు లావాదేవీల కూపీ లాగుతున్నారు అధికారులు. నాలుగైదు ఏళ్లుగా శ్రావణ్ మిల్లింగ్ బియ్యాన్ని పక్క దారి పట్టించిన అంశంపై లోతైన విచారణ జరుగుతుంది. రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఈ మిల్లుకు అప్పచెప్పింది. మిల్లింగ్ చేసిన 66 కోట్ల విల...

బీజేపీకి జెన్ జీ ఔట్ ఆఫ్ సిలబస్? యువత ఆందోళనలపై ప్రత్యేక విశ్లేషణ

Image
బీజేపీకీ జెన్ జీ పూర్తిగా ఔట్ ఆఫ్ సిలబస్! (* కొనతం దిలీప్) ఈ దేశంలో ఎవరు తమ హక్కుల కోసం గొంతెత్తినా వారిని దేశద్రోహులు అని ముద్రవేయడం బీజేపీ ఇన్నాళ్లూ వాడిన ఎత్తుగడ. కానీ ఆ ఎత్తుగడ ఇక పనిచేయదు అని ఢిల్లీలో జెన్ జీ యువత చేస్తున్న ఆందోళనలు నిరూపిస్తున్నాయి. ఇదివరకు సీఏఏ ఆందోళనల్లో రైతుల ఆందోళనల్లో బీజేపీ చాలా అలవోకగా వీరిని వేర్పాటువాదులు, మిలిటెంట్లు, దేశద్రోహులు అని ముద్రవేసింది. వారి ఐటీ సెల్ సహాయంతో సామాన్య ప్రజల్లో ఇదే విషయం మీద ప్రాపగాండా చేయగలిగింది కానీ నీట్ పేపర్ లీక్ అంశంతో రాజుకున్న జెన్ జీ ఆందోళనలు అలా కొట్టివేయడానికి వీళ్లేనివి ఎందుకంటే వీటిలో పాల్గొంటున్నది ఎక్కువగా మధ్యతరగతి భద్రజీవుల పిల్లలు. మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుండే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. ఈ రెండు సెక్షన్లలో సాంప్రదాయకంగా బీజేపీ మద్ధతుదారులు గణనీయ సంఖ్యలో ఉంటారు. అటువంటి సెక్షన్ల నుండే ఇప్పుడు బీజేపీ మీద, ప్రధాని మోదీ నాయకత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గత 2-3 రోజులుగా ఆ ముక్కుపచ్చలారని పిల్లల మీద పాశవికంగా అణచివేతను ప్రయోగిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద దేశమంతటా ఆగ్రహజ్వాలలు ఎగుస్తున్నాయి. యువతీయువ...

"సచ్చిపోబుద్ధి అవుతుంది.." SIR సర్వేలో బీఎల్‌వోల ఆవేదన.. కమిషనర్ జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి

Image
*హలో.. బలే* *సచ్చిపోబుద్ధి అవుతుంది..* *బి ఎల్ ఓ ల భావోద్వేగం.... కమిషనర్ గారు జర కన్నేయండి* వాయిస్ ఓవర్... హలో హలో మీ పేరు ఇదేనా అండి... నేను మీ బి ఎల్ వో ని మీ డివిజన్ పరిధిలో అంగన్వాడి ఫోన్ చేస్తున్నామండి. దయచేసి ఇక్కడికి వచ్చి సర్ తీసుకోండి.. నేను నేను వేరే చోట ఉన్నాను అనేది ప్రతి సమాధానం. పర్వాలేదండి మీ దగ్గరలో ఉన్న ఏదైనా చౌరస్తాకు రండి నేను ఇస్తా అనేది బి ఎల్ ఓ ఎదురు జవాబు. దీన్ని యవ్వ చచ్చిపోవాలనిపిస్తుంది. అనేది నిజాయితీ బిఎల్ఓ ల భావోద్వేగం. ఎలాగోలా ప్రత్యుత్తమరాలు నడుస్తున్నాయి. ఏదోరకంగా సర్ పాo ను అందుకున్న ఓటర్లు జాబితా అంతంత మాత్రమే ఇంకా కేవలం నాలుగు రోజులే కానీ చిక్కుముడని సమస్యలు లెక్కలేనివి. సదరు ఇంటి యజమాని లో అంతా అయోమయోమే.. చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి తేడా ఏమీ లేదు. సర్ ఫారం లు నింపడం అన్ని డాలర్ల ప్రశ్నార్థకమే... ఇంకేముంది సర్ పత్రం అందుకున్న దారుడు హడావిడిగా పరిగెత్తి మీసేవ, బాగా చదువుకున్న వారి చుట్టూ పరిగెడుతూ నానా టంటలు పడుతూ ఉంటారనేది నేటి నిజం. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కి తెలిసిన, ఉన్నత అధికార యంత్రాంగానికి తెలిసిన ఏమీ తెలియనట్లు ఉండడం కాకపోతే గ్రామ...

ఏనుగు దంతాలు ఊడినయ్.. శ్రేణులు ఆగం అయ్యినయ్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు)   ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో వెలిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గంజిలో పడ్డ ఈగ చందంగా మారింది. "ఏనుగు దంతాలు ఊడినయ్-శ్రేణులు అయోమయంలో పడినయ్" అంటూ రాజకీయ ప్రత్యర్ధులు రాగాలు తీస్తున్నారు.. ఈ విచిత్ర అరుదైన రాజకీయ పరిస్థితులపై మన నిజామాబాద్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇది.. ఏనుగు రవీందర్ రెడ్డి TRS రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి సీనియర్ MLA గా తిరుగు లేని ఆధిపత్యం చెలాయించారు..ఆ ఊపుతోనే ఈటెల రాజేందర్ తో బీజేపీలో చేరి హల్చల్ చేశారు.. అక్కడ వర్కవుట్ కాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బాన్సువాడ బాద్షా కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి BRS సిట్టింగ్ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డికి చుక్కలు చూపించారు.. తానోడినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారం కు చెక్ పెట్టారు.. బాన్సువాడ సెగ్మెంట్ లో ఇసుక పోయింట్స్ కంట్రోల్ లోకి తెచ్చుకుని కల్లం లో కుప్పలుగా ఎగబోసుకున్నారు.. పోలీస్, రెవెన్యూ తో పాటు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పోచారం శ్రీనివాసరెడ్డి కి ఊపిరి ఆడనీయలేదు ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈ పరిస్థ...

బీజేపీ వ్యతిరేక నినాదాల కేసు కొట్టివేత.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Image
ముంబైలో ఒక సామాన్యుడు బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అన్నందుకు నమోదైన కేసును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ మాధవ్ జామ్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఒక సామాన్యుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం, అతడిని బహిష్కరించడం వంటి చర్యలను కోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, జరుగుతుంటే పౌరులపై వరుస కేసులు పెట్టి అణచివేయడం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. నిరసనను అణచివేయడం అధికార సాధన కాదని, ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదని, అది పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. " పౌరులందరినీ మీరు ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదం చేస్తే కేసులు పెడతారా?" అంటూ ఆయన పోలీసులను నిలదీశారు. కళ్ల ముందే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాల మీదనే కక్...

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Image
* కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ * ........... టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి. సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మం...

నో టికెట్ గ్యారెంటీ..! గేరు మార్చిన బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) కారు పార్టీ గేరు మార్చింది.. ఆ స్పీడుకు MLA టికెట్ల ఆశావాహుల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రామన్న, హరిషన్న చుట్టూ ప్రదక్షిణ చేసి.. మస్క పాలిస్ తో టికెట్ కొట్టేయొచ్చనే ఆశలు ఆడియాసలే నన్న అంచనా కొచ్చారు BRS మాజీ MLA లు..ఇంత కాలం పట్న వాసానికి మరిగిన వీళ్ళు అబ్బా మళ్ళీ ఊరు బాట పట్టాలా అంటూ ఉసూరు మంటున్నారు..10ఏళ్ళు అధికారం చెలాయించి, సుఖానికి మరిగిన మాజీ MLA లు ఇప్పుడిపుడే పల్లె బాటను వెతుక్కుంటున్నరు. ఎవరికి వారు విధిగా ఓడిన చోటే విజయానికి మెట్లు వేసుకుంటారేనని అధిష్ఠానం రెండేళ్లు సమయం ఇచ్చి చూసింది.. అయినా మాజీలు పట్నం వీడలేదు.. అందుకే బూతు లెవల్ లో పార్టీ నిర్మాణం, సర్ ప్రోగ్రామ్ ను జోడించి అధిష్టానమే కార్యాచరణ ఇచ్చింది. దీనితో తప్పని పరిస్థితుల్లో మాజీ MLA లు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మాజీలు టీమ్ గా ఏర్పడి పర్యటిస్తున్నారు.. అయినా వారిని టికెట్ నో గ్యారంటీ అనే మాట నిద్రపోనిస్తా లేదు. "గతాన్ని చూసి టికెట్లు ఇచ్చేది లేదు..ఎంత సీనియర్..ఎన్ని టర్మ్ లు MLA గా పని చేసారు అనేది ల...

సౌమ్య కేసులో సంచలన ట్విస్ట్..! గంజాయి స్మగ్లర్లను తప్పించారనే ఆరోపణలు.. లీకైన వీడియోలో కొత్త విషయాలు

Image
( జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు) ... గంజాయి స్మగ్లింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నంలో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందిన సంఘటనకు సంబంధించిన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే వీడియో మన నిజామాబాద్ చేతికి చిక్కింది.. జనవరిలో నిజామాబాద్ సమీపంలోని మాధవనగరం ప్రధాన రహదారి మీద గంజాయి స్మగ్లర్ లను పట్టుకునే ప్రయత్నంలో సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. స్పాట్లో స్మగ్లర్లు ఉపయోగించిన కారు గుద్దిన సంఘటనలో ఆమె మృతి చెందింది.. ఆరు నెలల కిందట జరిగిన ఈ సంఘటనలో అసలు దోషులను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.. నిర్మల్,నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు ఆ రోజు స్పాట్ లో ఉన్నా.. కొందరిని ఆబ్కారీ అధికారులు తప్పించారని ఇద్దరు నిందితులు ఆక్రోశం వెళ్లగక్కిన వీడియో సౌమ్య కేసు వెనుక దాగివున్న డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఆబ్కారీ SHO స్వప్న ఆఫీసు బ్యారక్ లో నిందితులు అధికారులతో వాదనకు దిగిన సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు నిజామాబాద్ నిందితులను సౌమ్య కేసునుంచి తప్పించిన తీరును తేటతెల్లం చేస్తోంది.. నిందితుల్లో ఒకరు గాజు సీసాను పగులగొట్టి కొడుపును చీల్చుకునే ప్రయత్నం వల్ల నిందితు...