అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు

శభాష్ ఇందూరు పోలీస్ ( మన నిజామాబాద్ అర్బన్) అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు చేసినట్లుపోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. బి. శ్రీనివాస్ (నార్త్ రూరల్ బి శ్రీనివాస్), నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసినట్లు సిపి తెలిపారు. *నిందితుల వివరాలు* A1. షేక్ అర్బజ్ @ మయా, నివాసం: శారదానగర్ నయాబాది, బాసర గ్రామం & మండలం ప్రస్తుతం ధర్మబాద్, మహారాస్ట్రా A2. షేక్ ఆరిబ్, ఖుడ్వయినగర్ చౌరస్తా, ఇత్వార్ (పో), దెగ్ళూర్ నాఖా, నాందేడ్ జిల్లా, మహారాస్ట్రా A3. షేక్ రెహమాన్ , నివాసం. మహబూబ్య కాలనీ మోసంబి క మల్ల నాందేడ్ (పరారీలో ఉన్నాడు) A4.పేరు షేక్ అర్బాజ్ రెహ్మత్ నివాసం: రాంనగర్ ధర్మాబాద్ గ్రామం మరియు మండలం నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్) A5. పేరు సోన్ కాంబ్లె మనోజ్ శంకర్ నివాసం. జరికోట్ గ్రామం ధర్మాబాద్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర (రిసీవర్) A6. షెర్ అలి షాదుల్ షేక్, నివాసం: టెంభుర్ని గ్రామం నాయగావ్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్) A7. అవేజ్ నివాసం బాసర గ్రామం మరియు మండలం (రిసీవర్, పరారీలో ఉన్నాడు) షేక్ ఇమ్రాన్ @ అబూ @షేక్ సమీర్ తండ్రి షేక్ సలీం, వయస్సు. 20 సంవత్సరాలు,కులం ముస్లిం,వృతి. మైత్రి నివాసం. శారద నగర్ బాసర గ్రామానికి చెందిన వ్యక్తి అని అతను పరారులో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలోని బాసర, ముధోల్, భైంసా, తానూర్, నవీపేట్, మాక్లూర్, రెంజల్ , వర్ని తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 15 కేసులు డిటెక్ట్ చేయబడ్డాయన్నారు. అయితే షేక్ అర్బజమాయ, షేక్ ఇమ్రాన్ @ అబూ అలియాస్ షేక్ సమీర్ గతంలో బైక్, చైన్స్ స్నాచింగ్ దొంగతనాలు చేయగా నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినట్లు సాయి చైతన్య. వీరిపై గతంలో 10 కేసులు ఉన్నాయన్నారు.దర్యాప్తులో భాగంగా గత రెండు సంవత్సరాలు గా షేక్ అర్బజ్@ మాయ, షేక్ ఇమ్రాన్ @అబూ@షేక్ సమీర్, షేక్ ఆరిబ్, షేక్ రెహమాన్, అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి, నిజామాబాద్ , నిర్మల్ జిల్లాల పరిధిలో గల వివిద మండలలో పల్సర్ బైక్ లు లక్ష్యంగా దొంగతనాలు మొదలుపెట్టారని సీపీ వివరించారు. ఈ నలుగురు కలిసి దొంగతనం చేసినటువంటి సుమారు 17 బైకులను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్ కు చెందిన షేక్ అర్బాజ్ , రెహమత్, సోంకాంబ్లే మనోజ్, షేర్ షాదుల్ షేక్ తక్కువ ధరకు విక్రయించిన సంగతిని చెప్పారు. వీరి వద్ద నుండి పైన తెలిపినటువంటి 17 బైక్లను రికవరీ చేయడం జరిగిందని సిపి వివరించారు . వీరిని ఈనెల 17వ తేదీన సాయంత్రం నవీపేట్ మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా, పోలీసులను చూసి పారిపోతుండగా నిందితులను పట్టుకున్నారని సీపీ చెప్పారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, సమాచారంతో గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రెండు జిల్లాలకు చెందిన 15 కేసులను చేధించామన్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. కేసు చేధనలో నిజామాబాద్ డివిజన్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సి సి ఎస్ ఐ ఎ సి పి మస్తాన్ అలీ పర్యవేక్షణలో నార్త్ రూరల్ సి.ఐ బి.శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్సై మహేష్, నవీపేట్ ఎస్‌.ఐ కె.శ్రీకాంత్, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఠాకుర్ రాజేందర్ సింగ్, సిసిఎస్ కానిస్టేబుల్స్ రవికృష్ణ,సర్దార్ నరేష్ యాదవ్, నరేష్ కుమార్, వసీం, రాజేంద్రప్రసాద్. క్రైమ్ పార్టీ హెచ్‌సి రాజేశ్వర్, రాజారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, దత్తు గౌడ్, రాకేశ్, నాగరాజు, శంకర్, బాస్కర్, ఇతర సిబ్బంది అందరిని ఇతర సిబ్బంది ప్రతిభ కనబరిచారు. వారి సేవలను గుర్తించి సిపి సాయి చైతన్య అభినందించారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్